ఇప్పుడంతా ఫైన్ల కాలం నడుస్తోంది. తప్పు ఎలాంటిదైనా సరే.. భారీ ఫైన్లు వేసే కొత్త వాహన చట్టాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం కొన్ని అంశాలు సముచితంగా అనిపించినా.. మరికొన్ని అంశాల విషయంలో మాత్రం ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే ఇప్పటివరకూ విధిస్తున్న వంద జరిమానాకు బదులుగా వెయ్యి జరిమానాను విధించటాన్ని అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు వేలాది రూపాయిల జరిమానాను విధించటం లాంటివే పెద్ద సమస్యలుగా చెప్పాలి. వీటికి తోడు కొన్ని చిత్రమైన రూల్స్ ను పెడుతుండటంపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా అలాంటి రూల్ ఒకటి తెరమీదకు వచ్చింది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే లారీ డ్రైవర్లకు డ్రెస్ కోడ్ విధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది.
దీని ప్రకారం లారీ డ్రైవర్లు ఎవరైనా లారీని నడిపే సమయంలో లుంగీ కట్టుకొని ఉంటే.. సదరు డ్రైవర్ కు రూ.2వేలు జరిమానాను విధించాలని నిర్ణయించారు. ఇకపై లారీ నడిపే డ్రైవర్లు ఫుల్ సైజు ఫ్యాంటు.. షర్టు యూనిఫాంతో పాటు షూ తప్పనిసరిగా ధరించాలని రూల్ పెట్టారు.
లారీ డ్రైవర్లు ఎవరైనా సరే.. యూనిఫాం రూల్ ను పాటించకుంటే సదరు లారీ డ్రైవర్ కు రూ.2వేలు జరిమానాగా విధిస్తారు. గతంలోని నిబంధనల ప్రకారం ఈ తరహా రూల్ కు రూ.500 ఫైన్ ఉండేదని.. దాన్ని ఇప్పుడు రూ.2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దూర ప్రయాణాల సమయంలో షూ.. ఫ్యాంట్ షర్ట్ లాంటివి సౌకర్యంగా ఉండవంటున్నారు. పాలకులు డిసైడ్ చేసిన తర్వాత ప్రజలు పాటించక తప్పుతుందా?