ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ కు ఇప్పటివరకు నివారణ మందు లేదు. కేవలం జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ వైరస్ సోకిన వారు కోలుకుంటున్నారు... కానీ సత్వరం నయం అయ్యేందుకు మందు మాత్రం ఎవరూ కనిపెట్టలేదు. ఈ మందు కనిపెట్టేందుకు చైనా, అమెరికా మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణకు ఓ మందును అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ సూచించారు. అదే క్లోరోక్విన్ అంట. కరోనా నివారణకు ఈ మందు మస్త్ పని చేస్తుందని ట్రంప్ పరోక్షంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆ మందు తయారీకి ఇటీవల ఆయన ఆమోద ముద్ర వేశారంట. ప్రస్తుతం ఆ మందును టెస్టింగ్ చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే కరోనా నివారణకు ఆ మందును ప్రజలకు అందుబాటులో ఉంటామని ప్రకటించారు.
ట్రంప్ సూచించిన మందు క్లోరోక్విన్ మలేరియా నివారణకు ఉద్దేశించిన డ్రగ్. దీన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని స్ట్రేషన్ రూపొందించింది. దీనికి ఆమోదం తెలపడంతో కొన్నాళ్లు ఆ మందుపై ట్రయల్స్ చూడనున్నారు. కరోనా వైరస్ ను ఆ మందు దీటుగా ఎదుర్కొంటుదా అనే ప్రయోగం చేయనున్నారు. కరోనా నివారణకు క్లోరోక్విన్ మందు పని చేస్తున్నట్లు, కరోనా బాధితులకు ఈ మందుతో నయమైందని చైనా కూడా ప్రకటించింది. దీంతో ట్రంప్ ఆ మందు వైపు మొగ్గు చూపారు. అయితే క్లోరోక్విన్ మందును ఇప్పటికే దక్షిణకొరియా, బెల్జియం తదితర దేశాలు కరోనా నివారణకు వినియోగిస్తున్నాయి. యాంటిబయోటిక్ అజిత్రో మైసిన్ తో కలిపి ఈ మందు తీసుకుంటే కరోనా తగ్గుముఖం పట్టిందని ఆయా దేశాలు తమ పరిశీలనలో వెల్లడించాయి. త్వరలోనే చైనా ఈ మందు విడుదలకు చర్యలు తీసుకుంటుండగా అమెరికా ట్రయల్స్ మొదలుపెట్టింది. వెంటనే ఈ మందును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు పెద్ద దేశాల మధ్య కరోనా నివారణ మందుపై పోటీ ఏర్పడింది.