అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాకు హెచ్చరికలు పంపారు. పరిస్థితులు చేయిదాటితే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్ మాట్లాడుతూ.. చైనా ఆర్థిక వ్యవస్థపై ఆధారపడకుండా జాగ్రత్త పడుతామని స్పష్టం చేశారు. చైనాతో వ్యాపారం చేయాలనుకోవడం లేదని.. ఎందుకంటే మేము సరైన భాగస్వామి అని చైనా అనుకోవడం లేదు. అందుకే మేము కూడా అలానే ఆలోచిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికాలో కరోనా కల్లోలానికి చైనానే కారణమని ట్రంప్ విమర్శిస్తున్నారు. చైనా నుంచి దిగుమతుల సుంఖాన్ని ఇదివరకే పెంచారు. చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాన్ని పెంచింది.
చైనాలో అమెరికా తయారీ సంస్థలకు న్యాయమైన, స్థాయిని బట్టి అవకాశాలు కల్పించకపోతే వేరుపడక తప్పదని తాజాగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్ పేర్కొన్నారు.