అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా మన ఐటీ సంస్థలు విలవిల్లాడిపోతున్నాయి. ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా వియలం నేపథ్యంలో అమెరికన్ల సంక్షేమం కోసమంటూ ట్రంప్ ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోకి తాత్కాలిక వలసలను నిలిపివేసేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై తాను సంతకం చేస్తానంటూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన వచ్చీ రాగానే... మన ఐటీ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. కరోనా విలయంలోనూ మన ఐటీ సంస్థల షేర్లు పెద్దగా నష్టపోలేదు. అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ చేసిన సింగిల్ ప్రకటన నేపథ్యంలో మంగళవారం అటు సెన్సెక్స్ తో పాటు ఇటు నిఫ్టీలోనూ మన ఐటీ సంస్థల షేర్లు భారీగా పతనమయ్యాయి.
మన దేశానికి చెందిన ఐటీ సంస్థలు మన దేశంతో పాటు అమెరికాలోనూ శాఖలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా అమెరికాకు చెందిన సంస్థలకు ఐటీ ఆధారిత సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో మన ఐటీ సంస్థలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో అమెరికా ప్రజలను కాపాడుకునేందుకు, అదే సమయంలో అమెరికన్ల ఉద్యోగాలను రక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ...అమెరికాలోకి తాత్కాలిక వలసలను నిలిపివేస్తున్నట్లుగా మంగళవారం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన వచ్చినంతనే మన దేశానికి చెందిన ప్రముఖ ఐటీ సంస్థలు టీసీఎస్ - ఇన్ఫోసిస్ - టెక్ మహీంద్రా - విప్రో, - హెచ్ సీఎల్ - హెక్సా వేర్ - ఎన్ ఐఐటీ - మైండ్ ట్రీ సంస్థలకు చెందిన షేర్లు 1 నుంచి 5 శాతం మేర నష్టపోయాయి.