అధికార బదిలీకి ఒప్పుకోకుండా.. తన గెలిచానని పేచీపెడుతూ తన మద్దతుదారులతో నానా యాగీ చేస్తున్న ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జోబైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కొత్త అమెరికా అధ్యక్షుడు గద్దెనెక్కబోతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేశారు.
తాజాగా ఫ్లోరిడాలోని తన ఇంటికి ట్రంప్ దంపతులు బయలుదేరారు. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేయడం గమనార్హం. ట్రంప్ ఇప్పటికే జోబైడెన్ ను అంగీకరించనని.. వైట్ హౌస్ ను ఖాళీ చేయనంటూ భీష్మించుకు కూర్చున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ సడెన్ గా వైట్ హౌస్ ను ఖాళీ చేయడం విశేషం.
అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్ (78) బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇప్పటికీ ఓటమిని అంగీకరించడం లేదు. దేశ ప్రజాస్వామ్య సౌధంపైనే దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాల మధ్య.. దాడులు, అల్లకల్లోలం సూచనలతో జోబైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అత్యంత భద్రతతో సాగుతోంది.
జోబైడెన్ కేపటల్ హిల్ భవన మెట్లపై ఉన్న వేదిక నుంచి పదవీ ప్రమాణం చేస్తారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ఆయన కంటే ముందుగానే ప్రమాణం చేస్తారు. భారతీయ మూలాలున్న కమల ఇక మీదట శ్వేతసౌధంలో అత్యంత కీలకపాత్ర పోషించనున్నారు.