హాంకాంగ్ విషయంలో చైనా వైఖరిని తొలి నుంచీ దుయ్యబడుతూ వస్తున్న అమెరికా.. డ్రాగన్ కంట్రీపై చర్యలకు సిద్ధమవుతోంది. తాము తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేయబోతున్నదీ మాత్రం చెప్పలేదు. మేం ఇప్పుడు ఏం చేస్తున్నామో వారంలోగా మీకు తెలుస్తుంది. మేము తీసుకునే నిర్ణయం మీకు అత్యంత ఆసక్తికలిగించేదిగా ఉంటుంది. అంతేగాక అది శక్తివంతమైన నిర్ణయం అయి ఉంటుంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఇంతకుమించి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన హాంకాంగ్ ను స్వాధీనం చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న చైనా.. హాంకాంగ్ లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు అనువుగా ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. చైనా తీరుపై హాంకాంగ్ లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని, తమ కంపెనీలను బ్రిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో లిస్ట్ చేయడం ద్వారా అమెరికాకు చెక్ చెప్పాలని భావిస్తోంది.
అయితే, ఈ నేపథ్యంలో హాంకాంగ్ పై చైనా పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదంటూ ట్రంప్ ఇదివరకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా, మరోమారు అదే విషయాన్ని గట్టిగా చెప్పారు. అయితే, ఈసారి వారం రోజుల్లోనే అదేదో మీరే చూస్తారంటూ చెప్పడం గమనార్హం. చూడాలి మారి వారం రోజుల్లో ట్రంప్ ఏంచేయబోతున్నారో ..