హూజూరాబాద్ లో రాజకీయం హీటెక్కింది. ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో మంత్రుల పర్యటనతో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగానే నిన్న కొన్ని గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు సందడి చేశారు. మంత్రి హరీశ్ రావుతో పాటు ఇతర మంత్రులు పర్యటనలు సాగించారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. బైక్ పై ర్యాలీలు తీస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అయితే కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలిగిపోలేదన్న సంకేతాలు వెలువడుతున్నా.. అధికార పార్టీలో ఉన్న మంత్రులు నిబంధనలు పాటించరా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మంత్రులతో పాటు వారితో ఉన్నవారు సైతం ఒక్కరూ మాస్క్ ధరించలేదు. పైగా బైక్ నడుపుతూ హెల్మెట్లు పెట్టుకోలేదు. దీంతో వీరి ఫొటోలను నెట్లో అప్లోడ్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హూజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ గెలిచేందుకు పోటా పోటీ వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ దాదాపు ఖరారైనట్లే. దీంతో ఈటల ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కేసీఆర్, హరీశ్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీంతో హరీశ్ రావు రంగంలోకి దిగారు. స్వయంగా నియోజకవర్గంలో పర్యటించేందుుకు నిన్న వచ్చారు. అభ్యర్థి ప్రకటనతో పాటు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న హరీశ్ రావు నియోజకవర్గాన్ని రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున్న ర్యాలీలు తీశారు. సభ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారు చేయడంతో సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదు. థర్డ్ వేవ్ ఏ క్షణాన ముంచుకొస్తుందో అర్థం కానీ పరిస్థితి. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ మంత్రులే కరోనా నిబంధనలు పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో మరిచిపోయి మాస్క్ ధరించకపోతే రూ.1000 వరకు ఫైన్ వేస్తున్నారు. ఇదే కరీంనగర్ సీపీ ఇటీవల ప్రకటన చేశారు కూడా. అయితే అధికార పార్టీ నాయకులొక్కరికీ మాస్క్ లేకపోవడం గమనార్హం.
ఇక స్కూటర్ పై వెళ్తున్న వారికి హెల్మెట్ లేకపోతే వెంటనే ఫైన్ విధిస్తున్నారు. ఫైన్ కట్టకపోతే బండి సీజ్ చేస్తున్నారు. మరి మంత్రులు హెల్మెట్ వాడనక్కర్లేదా..? అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.
సెకండ్ వేవ్ కంటే ముందు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరిగింది. ఈనేపథ్యంలో అక్కడ జరిగిన సభలో పాల్గొన్న తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత కొందరు కార్యకర్తలు కరోనా కోరల్లో చిక్కకొని సరైన వైద్యం అందక మరణించారు. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని కొందరు వైద్య నిపుణులు సూచిస్తున్నా కొందరు జాగ్రత్తలు పాటించడం లేదు. ఇప్పటికే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నాయకులు ఇలా కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈనెల 16న కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో సభ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొందరు నిబంధనలు పాటిస్తున్నా అవసరాల కోసం బయటకు వెళ్లిన వారు కరోనాబారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తే కరోనా విస్తరించడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని కొందరు అంటున్నారు. మరి నాయకులు ఈ విమర్శలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.