కనివీనీ ఎరుగని విషాదానికి 15ఏళ్లు

Update: 2019-12-26 14:30 GMT
ప్రకృతి ప్రకోపానికి 2.70లక్షల మంది చనిపోయిన అతిపెద్ద ఉత్పాతమది.. 2004, డిసెంబర్ 26న క్రిస్మస్ తెల్లవారి వచ్చిన ఈ ప్రమాదం చరిత్రలోనే అతిపెద్ద మానవ వినాశనాల్లో ఒకటి.

హిందూ మహాసముద్రంలో ఇండోనేషియా దేశంలోని సుమత్ర ద్వీపం సమీపంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.3గా నమోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్టీలకు సమానం. అమెరికా  రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లో వేసిన అణుబాంబుల శక్తి కంటే దాదాపు 23000 రెట్ల అధిక శక్తి ఈ సునామీ వల్ల విడుదలైంది. లక్షల మంది ప్రాణాలు తీసింది.

సుమత్రాలోని ఆచె తీర ప్రాంతంలో ఇండియా భూగర్భ ప్లేట్, బర్మా ప్లేట్ మధ్యన ఘర్షణ ఏర్పడడంతో భూకంపం సంభవించింది. 1000 కిలోమీటర్ల పొడువు, పది మీటర్ల లోతు మేరకు సముద్రంలో చీలిక ఏర్పడింది. 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి 100 అడుగుల మేరకు అలలు ఎగిసిపడి గంటల వ్యవధిలోనే శక్తివంతమైన రాకాసి అలలు తీరంవైపు వచ్చి హిందూ మహాసముద్రంలోని 14 దేశాలపై విరుచుకుపడ్డాయి.  5వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికా తీరాన్ని కూడా తాకడం విశేషం.

ప్రపంచవాప్యంగా 2.70లక్షల మందిని సునామీ బలితీసుకుంది. భారత్ లో సుమారు 10వేల మందికి పైగా మరణించారు. తమిళనాడు తీరంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న 4500 మంది మృతిచెందారు.

ఈ సునామీ వచ్చి నేటికి 15ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నాటి దారుణ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ డిసెంబరు 26న ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తమ పాత జ్ఞాపకాలను.. కోల్పోయిన ఆప్తులను గుర్తు చేసుకుంటున్నారు.


Tags:    

Similar News