తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆస్తులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్వేతపత్రం విడుదల చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి స్వామివారికి వివిధ బ్యాంకుల్లో మొత్తం రూ.15,938.68 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్టు టీడీపీ వెల్లడించింది. అలాగే వివిధ బ్యాంకుల్లో 10,258.37 కిలోల (10 టన్నులు) బంగారం ఉన్నట్లు తెలిపింది.
టీటీడీ నిబంధనల ప్రకారం అధిక వడ్డీ చెల్లించేందుకు ముందుకొచ్చే షెడ్యూల్డ్ బ్యాంకుల్లోనే నగదు డిపాజిట్ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారికి హుండీ ద్వారా వచ్చిన బంగారు కానుకలను కరిగించి, శుద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ బంగారాన్ని 12 ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టేందుకు భారత ప్రభుత్వ మింట్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు.
టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదని, భవిష్యత్తులోనూ ఇవ్వబోదని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. డయల్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ పెట్టుబడి పెట్టలేదు అని తెలిపారు. వడ్డీ ఎక్కువగా వచ్చే జాతీయ బ్యాంకుల్లో మాత్రమే నగదును డిపాజిట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
కాగా శ్రీవారికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులతోపాటు నగదు, బంగారం డిపాజిట్లు, ఆభరణాల విలువ సుమారు రూ.2.25 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల్లో 960 ఆస్తులు ఉన్నట్లు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యవసాయ భూమితో పాటు స్థలాలు, భవనాలు ఉన్నాయి. వీటి విలువ రూ.75 వేల కోట్ల మేర ఉంటుందని సమాచారం. ఇది కేవలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల విలువ మాత్రమేనని.. దీనికి మార్కెట్ విలువ రెండున్నర నుంచి మూడు రెట్లకు పైగా (అంటే రూ.1.87 లక్షల కోట్ల నుంచి రూ.2.10 లక్షల కోట్లు) ఉంటుందని చెబుతున్నారు.
స్వామివారికి ప్రస్తుతమున్న ఆభరణాలతోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఉండే ఆభరణాల బరువు 250 కిలోల వరకు ఉంటుందని అంటున్నారు. ఇందులో పురాతనమైన, విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయి. స్వామివారి ఆస్తులు, ఆభరణాలు, నగదు, వెండి, బంగారు డిపాజిట్ల విలువ రూ.2.25 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్