తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు.. భూమన కరుణాకర్ రెడ్డి విషయంవైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోరని.. ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. నిజాని కి ఇప్పటికే ఆయన ఒకింత అసహనంతో ఉన్నారు. పార్టీ తరపున కార్యక్రమాలుచేస్తున్నా.. పార్టీపై అభిమా నం ఉన్నా.. అభివృద్ది చేయలేకపోతున్నాననే ఆవేదన ఆయనలో కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరని ఆయన వర్గం చెబుతోంది. అయితే.. దీనికి మరో రీజన్ కూడా ఉందని.. ఆయన అలిగి కాదు.. సీఎం జగన్.. భూమనకు ఇచ్చిన అభయం..కుదిరిన డీల్ కారణంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుంటున్నారని మరికొందరు అంటున్నారు. ఇక, విషయం ఏంటంటే.. ఇటీవల సీఎం జగన్‌ను భూమన కలిశరు.
ఈ సందర్భంగానే కాకుండా.. గతంలోనూ ఆయన తన మనసులో మాటను విన్నవించుకున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఆయన కాంక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక, పోటీ చేయబోనని.. తనకుమారుడికి ఆ సీటు ఇవ్వాలని.. అదేసమయంలో తనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఇవ్వమని ఆయన కోరుతున్నా రు. అయితే, దీనిపై సీఎం జగన్ నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్నారు.
అయితే, ఇప్పుడు మారిన పరిణామాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల భూమనను స్వయంగా తాడేపల్లికి పిలిచి మరీ.. ఈ శుభవార్త జగన్ చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అయితే.. ఇంత వరకుబాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే విషయంపై మాత్రం సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇక, టీటీడీ బోర్డును మార్చి 20 తర్వాత రద్దుచేసి.. భూమన నేతృత్వంలో కొత్త బోర్డును ఎంపిక చేస్తారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.