చట్టం విషయంలో అందరూ సమానులేనని.. ఈ విషయంలో దేవుడు కూడా చట్టానికి అతీతుడు కాదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖమ్మంలోని టీటీడీ కల్యాణ మండపం భూవివాదంలో హైకోర్టులో ఈ వ్యాఖ్యలు చేసింది.
టీటీడీకి చెందిన 12 గుంటల భూమిని వెనక్కి తీసుకుంటున్నారని వీహెచ్.పీ నేత అంజయ్య హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణలో టీటీడీ ఆధీనంలో 12 గుంటల భూమి అదనంగా ఉందని ఖమ్మం కార్పొరేషన్ తెలిపింది. భూమి విషయంలో టీటీడీ స్పందించకపోవడం పై హైకోర్టు సీరియస్ అయ్యింది.ప్రభుత్వ భూమినే టీటీడీ ఆక్రమించినట్లు అనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
దేవుడి పేరిట భూ ఆక్రమణ సరికాదని.. దేవుడు కూడా చట్టానికి అతీతుడు కాదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను సెప్టెంబరు 8కి కోర్టు వాయిదా వేసింది.