నెల రోజులు.. కోటి లడ్లు. వినేందుకు వామ్మో అనిపించే ఇది వాస్తవమైంది. శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చే అశేష భక్త జనానికి అవసరమైన లడ్డూ ప్రసాదాన్ని అందించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం అలుపెరగక శ్రమించి.. భక్తకోటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాన్ని అందించే ప్రయత్నం చేసింది. ఏడాది మొత్తం ఎలా ఉన్నా.. మే లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. వేసవి సెలవులు.. పరీక్షా ఫలితాలు విడులయ్యే నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకోవటానికి.. మొక్కులు చెల్లించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.
ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఇచ్చే లడ్డూలు మే లో రికార్డు స్థాయిలో కోటి లడ్డూల ఉత్పత్తిని చేసినట్లుగా టీటీడీ పేర్కొంది.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క నెలలో 25.08 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రాయితీ మీద లడ్డూను భక్తులకు అందజేయటం తెలిసిందే. నెల మొత్తంలో మే 28న ఒక్కరోజే అత్యధికంగా 4.05 లక్షల లడ్డూలను పంపిణీ చేసినట్లుగా టీటీడీ చెబుతోంది. దేవస్థానం చరిత్రలో ఒక్క నెలలో ఇంత పెద్ద ఎత్తున లడ్డూ ఉత్పత్తి చేపట్టలేదని చెబుతున్నారు. 2013లో 72.33 లక్షలు.. 2014లో 80.64 లక్షలు.. 2015లో 89.84 లక్షల లడ్డూలను పంపిణీ చేయగా.. ఈ మేలో కోటి మార్క్ ను అవలీలగా దాటేయటం విశేషంగా చెప్పాలి.