తెలుగువారికి మాత్రమే కాదు.. యావత్ దేశ ప్రజలకు ప్రీతిపాత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆయన్నుదర్శించుకునేందుకు ఎంతలా ప్లాన్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దివ్య దర్శనం దొరుకుతుందని చెప్పాలే కానీ.. అప్పటికప్పుడు అన్ని పనులు వదులుకొని శ్రీవారి దర్శనం కోసం పరుగులు తీసే వారు వేలాదిగా ఉంటారు. ఇక.. వీఐపీ భక్తులకు ఇచ్చే ఎల్ 1 దర్శనం లాంటివి దొరుకుతాయంటే.. అప్పటికప్పుడు తిరుమల ప్రయాణానికి బయలుదేరే వీవీఐపీలు ఎందరో.
అలాంటిది గడిచి వారం భారీ వర్షాల కారణంగా తమ చేతిలో టికెట్లు ఉండి కూడా శ్రీవారిని దర్శించుకోలేని పరిస్థితి. నెలల ముందు టికెట్లను బుక్ చేసుకొని.. ప్రయాణ ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత దర్శనం దొరకని వైనానికి భక్తులు తీవ్ర వేదనకు గురి కావటం ఖాయం. ఈ విషయాన్ని గుర్తించిన టీటీడీ భక్తులు మనసుల్ని తేలిక పరిచే ప్రకటనను తాజాగా చేశారు.
భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ సరిగా లేకపోవటం.. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళనతో అర్థాంతరంగా తమ ప్రయాణాల్ని ఆపేసుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకోలేదన్న దిగులుతో ఉన్నారు. ఇలాంటి వారికి సాంత్వన కలిస్తూ.. తీపికబురును చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. నవంబరు 18 నుంచి 30 లోపు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.
సదరు సాఫ్ట్ వేర్ సాయంతో ఆన్ లైన్ లో ఈ నెల 18 నుంచి 30 లోపు బుక్ చేసుకున్న టికెట్ నెంబరును ఎంటర్ చేస్తే.. ఆరు నెలల లోపు మరో స్లాట్ బుక్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీంతో.. అవకాశం ఉండి దర్శనం చేసుకోలేకపోతున్నామని వేదన చెందే వారికిఇదో చక్కటి అవకాశంగా చెప్పక తప్పదు. శ్రీవారి భక్తులకు ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది చెప్పండి.
ఇక.. భారీ వర్షాల కారణంగా తిరుమలలో భారీగా వరద నీరు పారటం.. చాలా నష్టం జరిగిందన్న ప్రచారం జరిగింది. దీనికితోడు నడక మార్గం తీవ్రంగా ప్రభావితమైనట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన టీటీడీ స్పష్టత ఇచ్చింది. అధిక వర్షపాతం నమోదైనా.... ఒకటి రెండు ప్రదేశాల్లో మినహా మరెక్కడా ఆస్థి నష్టం జరగలేదని చెప్పింది. భక్తులు నిర్భయంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా మొత్తం 13 చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయని.. అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పింది.
శ్రీవారి మెట్టు వద్ద నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయని.. వాటి మరమ్మత్తులు చేయటానికి కొంత సమయం పడుతుందని.. శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని ప్రకటించారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి భక్తులు తిరుమలకు రావొచ్చని స్పష్టం చేశారు. ఈ నెల 26న మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇంజనీరింగ్ తో పాటు ఆరోగ్య శాఖాధికారుల్ని అప్రమత్తం చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.