సినీ నటుడు - ఎస్వీబీసీ చైర్మన్ గా మొన్నటి వరకూ వ్యవహించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. ఎస్వీబీసీలో పనిచేసే ఒక మహిళతో ఆడియో టేపుల వ్యవహారం బయటపడడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. విచారణ అనంతరం తప్పు లేకపోతే తిరిగి చేరుతానన్నారు.
తాజాగా ఎస్వీబీసీ చైర్మన్ రాజీనామా వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వీరు ఎస్వీబీసీలో విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో దిమ్మదిరిగే విషయం వెలుగుచూసిందని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ కు చెందిన ఇద్దరి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆడియోలో ఫృథ్వీతో పాటు మాట్లాడిన సదురు ఎస్వీబీసీ ఉద్యోగిని మహిళ ఎవరనేది తెలియరాలేదట.. ఆమె పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయకపోవడంతో కేసులో పీటముడి నెలకొంది.
అయితే ఎస్వీబీసీ చైర్మన్ గా ఫృథ్వీ ఉన్న సమయంలోనే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఫృథ్వీ టాలీవుడ్ నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చారని విచారణలో తేలినట్టు సమాచారం. దీనిపై విజిలెన్స్ ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఫృథ్వీ ఎస్వీబీసీలో అక్రమంగా చేపట్టిన ఉద్యోగ నియమాకాలపై ఆరాతీస్తున్నారట..విజిలెన్స్ నివేదికపై ఫృథ్వీ భవిష్యత్ ఆధారపడబోతోందని తెలుస్తోంది.