అధికార టీఆర్ ఎస్ పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాలనుకున్న తెలుగుదేశం తెలంగాణ శాఖ ఆ స్థాయికి ఎదగలేకపోగా ప్రస్తుత పరిణామాలతో పరిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యిలా తయారైంది. పార్టీ నేతల్లోనే సఖ్యత లేకపోవడం - పైగా పార్టీ అధిష్టానం చిన్నచూపు ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. ఒకవైపు ఉద్యమించాలని ఉద్బోధ చేస్తూనే మరోవైపు పార్టీని పట్టించుకోకపోవడం ఏమిటని తెలంగాణ తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ సర్కారును ఢీకొట్టేలా పార్టీ నాయకత్వం లేకపోవడం, ఆమేరకు యంత్రాంగాన్ని సమాయత్తం చేసే ప్రయత్నాలు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
టీటీడీపీని బలోపేతం చేయాలని కొద్దికాలం క్రితం నిర్ణయించి పార్టీ అధినేత చంద్రబాబు వారంలో ప్రతి శనివారం టీడీపీ యువనేత లోకేశ్ తెలంగాణ శాఖకు సమయం కేటాయిస్తారని గతంలో ప్రకటించారు. ఒకటిరెండు వారాలు ఈ సౌలభ్యం అమలైనప్పటికీ ఆ తరువాత అది పత్తాలేకుండా పోయింది. నెలలో ఒకరోజు సమావేశమవుదామని హామీ ఇచ్చిన అధినేత చంద్రబాబు మాట సైతం అటకెక్కిందని అంటున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల మహిళ - విద్యార్థి - యువజన - రైతు ఇతర అనుబంధ విభాగాలతో తరువాత బాబు భేటీ అయిన సందర్భంగా పాత పాటే పాడారని టీడీపీ నేతలు వాపోతున్నారు. పార్టీని తెలంగాణలో పటిష్టం చేయాలని, కొత్త జిల్లాలకు అనుగుణంగా కమిటీలు వేసేందుకు ప్రణాళిక రూపొందించాలని - ప్రజా సమస్యలపై పోరుబాట వీడరాదని హితవు పలికారు. అయితే రాష్ట్ర నాయకత్వంలో అంతర్గతంగా ఉన్న విభేదాల విషయమై తరచి చూసే ప్రయత్నం చేయడం లేదని ఒకరిద్దరు నేతలు చెబుతున్నారు. పార్టీని పటిష్టం చేయాలని చెప్పినా, నాయకుల మధ్య సఖ్యతను పెంచాల్సిన బాధ్యత కూడా అధినేత మీద ఉందంటున్నారు.
తెలంగాణ పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ - కార్యనిర్వాహాక అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఆపార్టీలోనే ఒకింత ప్రచారం సైతం జరుగుతున్నది. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాల్లో వీరు ఇరువురు సంద్రింపులు చేసుకోకుండా, చర్చలు జరపకుండా ప్రకటిస్తున్నారని, దీంతో పార్టీ జిల్లా యూనిట్లు - యంత్రాంగం అయోమయానికి గురవుతున్నదనే ప్రచారం సైతం చోటుచేసుకుంటోంది. మల్లన్నసాగర్ రైతులకు మద్ధతుగా చేపట్టిన మెదక్ జిల్లా బంద్‌కు రేవంత్ ఒక్కరే వెళ్లారు. ఇతర పార్టీలు పెడుతున్న సభలకు రమణ మాత్రమే హాజరవుతున్నారు. తెలంగాణ నాయకత్వం ఎవరికి వారే యుమునా తీరేలా వ్యవహరిస్తున్నది ఆ పార్టీ యంత్రాంగం అభిప్రాయపడుతున్నది. ఇతర సీనియర్ నాయకులు ఎన్టీఆర్ భవన్ లో ప్రెస్ మీట్లకు పరిమితమవుతున్నారు. మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు. రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు పొలిట్ బ్యూరోను - రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరచి సర్కారుపై దండయాత్ర చేయాల్సింది పోయి, అంతర్గతంగా కొట్టాడుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ నాయకులందరికీ ఉమ్మడిగా మరో సమస్య ఉందని తెలుస్తోంది.ఆయా సమస్యలు పోరాటాలకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ప్రతి చిన్న విషయానికి యువనేత లోకేశ్ దగ్గరకు, ప్రతి పనికి అధినేత చంద్రబాబు దగ్గరకు తీసుకుపోవడం తప్పనిసరి కావడంతో తెలంగాణ శాఖ అస్థిత్వం ఏముందనే విమర్శలు ఆపార్టీ నుంచే వస్తున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో తీరికలేకుండా ఉన్న చంద్రబాబు - తాను తెలంగాణ సమయం ఇవ్వలేనని అంతర్గతంగా చెప్పినట్టు సమాచారం. కేంద్రంతో ప్రత్యేక హోదా విషయమై ఒకింత గుర్రుగా ఉన్న బాబు - అమరావతి వ్యవహారం హైదరాబాద్ నుంచి ఉద్యోగుల తరలింపు - స్థానికంగా అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాల అమలు తదితరాలపై దృష్టిపెట్టాల్సి ఉందని ఆపార్టీ నాయకత్వం అంటున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాఖకు సమయం ఇవ్వడంలో ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. ఒటుకు నోటు కేసు ఎటూ తేలకపోవడంతో ఆయన తెలంగాణ విషయాల్లో పూర్తిస్థాయిలో జోక్యం చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు సైతం ఆపార్టీ నుంచి వినిపిస్తున్నాయి.