తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. అదే సమయంలో వారి ఫాలోవర్లు తెగ వర్రీ అయిపోతున్నారు. తమ నాయకుడు పావులు కదిపితే ఎంతవారైనా చిత్తు కావాల్సిందేనని గొప్పలు చెప్పుకునే వారు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు నోట మాట రాని పరిస్థితి.
తెలుగు తమ్ముళ్ల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసిన ఘటనల్లో ఓటుకు నోటు వ్యవహారం ఒకటిగా చెబుతున్నారు. పార్టీ ఫైర్ బ్రాండ్ ను అడ్డంగా బుక్ చేస్తూ వీడియో టేపులు ప్రసారమైన సందర్భంగా తగిలిన షాక్ అంతా ఇంతా కాదు. దాని నుంచి ఇప్పటికి కోలుకున్నది లేదు. ఓటుకు నోటు ఉదంతంలో ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ నేతలకు ఒక పట్టాన మింగుడుపడలేదు.
ఈ వ్యవహారం ఇలా ఉన్న సమయంలో తమ ఫోన్లు ట్యాప్ అయిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ.. సమయానికి తగ్గట్లు తమకున్న ఆధారాల్ని చూపించి తెలంగాణ అధికారపక్షాన్ని ఇరుకున పడేయలేదన్న బావన తమ్ముళ్లలో ఉంది. ట్యాపింగ్ విషయంలో పార్టీ నేతలు సైతం సందేహాలు వ్యక్తం చేశారని.. ముఖ్యనేతల్లో కూడా ఇలాంటి సందేహాలుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తీర్చాల్సిన పరిస్థితిని వాపోవటం కనిపిస్తుంది.
ఓటుకు నోటు వ్యవహారంలో ఆధారాలు సేకరించేసరికి పుణ్యకాలం గడిచిపోయిందని.. చివరకు కాల్ డేటా సేకరించే విషయంలో సైతం తెలంగాణ ప్రభుత్వం ఉన్నంత వేగంగా.. ఏపీ సర్కారు లేదన్న అసంతృప్తి ఉంది. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ బద్నాం కావటమే కాదు.. అందరి వేళ్లు తమ వైపే చూపేలా చేశాయని.. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో టీఆర్ ఎస్ ను అదే రీతిలో ఫిక్స్ చేయటంలో తమ పార్టీ విఫలమైందన్న అభిప్రాయం తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. అసలు.. తమ సర్కారుపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏం అనుకుంటోంది? వారి లక్ష్యం ఏమిటి? రాజకీయంగా తమను ఏ స్థాయిలో దెబ్బ కొట్టే అవకాశం ఉందన్న విషయాల్లో దృష్టి పెట్టాలన్న ఆలోచన కూడా లేనట్లుగా ఉండటం గమనార్హం.
చివరకు తెలంగాణ ప్రభుత్వమే.. అవును.. ఏపీకి చెందిన కొందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు హైకోర్టులో చెప్పుకోవటం చూసినప్పుడు.. వారికున్న తెగవ.. అంత ఓపెన్ గా కమిట్ అయినప్పటికీ వారిని ఏమీ చేయలేని పరిస్థితి మొత్తాన్ని తమ వ్యూహ వైఫల్యంగా పేర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా తమ అధినేత కుమారుడి కారు డ్రైవర్ కు నోటీసుల వ్యవహారంలోనూ తెలంగాణ అధికారులే హుషారుగా ఉన్నారని.. జరగబోయే పరిణామాలను ముందుగా గుర్తించటంలో వైఫల్యం తమను దోషిగా నిలబెడుతుందన్న వాదనను వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ సీఎం ఇంటి దగ్గరకు వచ్చి.. వారింట్లో వారి వివరాలు సేకరిస్తూ.. కాగితం చిట్టీ మీద రాసుకున్న వారు టీ ఏసీబీ అధికారులని.. అలా నిఘా ఎలా పెడతారంటూ గట్టిగా మాట్లాడి పంపించటమే తప్పించి.. వివరాలు సేకరించింది ఎందుకన్న కోణంలో దృష్టి సారించినా..లేదంటే.. ఈ వ్యవహారంలో మరింత కటువుగా ఉన్న పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు.
ఏపీ సీఎం ఇంటి దగ్గరకు వెళ్లిన టీ ఏసీబీ అధికారులు ఏ అధికారంతో ఇలాంటి పనులు చేస్తున్నారని చట్టబద్ధంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇది జరిగిన 24 గంటల్లోనే ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ కారు డ్రైవర్ కు నోటీసులు ఇవ్వటం గమనార్హం. ప్రతిసారీ తాము వేసే అడుగు.. ప్రత్యర్థి తర్వాతే ఉండటం.. ఇదంతా చూసిన వారికి.. వాళ్లు అది చేశారు కాబట్టి.. వీళ్లు అందుకు ప్రతిగా ఇలా చేస్తున్నారన్న అపప్రద మూటగట్టుకోవటంతోపాటు.. తప్పు చేసింది ఒక పక్షం వారన్నట్లుగా ఉందన్నది తమ్ముళ్ల బాధ. ఇదంతా వ్యూహ వైఫల్యం.. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎక్కడి వరకూ వెళ్లాలి? అన్న అంశాల విషయంలో స్పష్టత లేని కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఎర్పడుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా బాబు వ్యూహ వైఫల్యం.. పార్టీకి భారీ నష్టాన్ని కలిగించటమే కాదు.. అందరి ముందు దోషిగా నిలబడేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.