కొన్ని విషయాలు విన్నంతనే షాక్ కు గురి చేస్తాయి. ఆ కోవకు చెందిందే తాజా వార్త. టికెట్ తీసుకోకుండా ప్రయాణించే మహిళా ప్రయాణికుల విషయంలో ఒక టీసీ చేసే అకృత్యం తాజాగా బయటకు వచ్చింది. అతగాడి తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. చెన్నై శివారు ఈస్ట్ తాంబరం ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల శివకుమార్ లీలలు బయటకు రావటం.. వాటి గురించి తెలిసిన రైల్వే అధికారులే కాదు.. సామాన్యులు సైతం అవాక్కు అవుతున్నారు.
ఇంతకూ ఇతగాడు చేసేదేమంటే.. ఎగ్మూరు రైల్వేస్టేషన్ లో టీసీగా వ్యవహరించే ఇతడు.. ఎవరైనా టికెట్ తీసుకోకుండా రైల్లో ప్రయాణిస్తే.. వారిని పట్టుకునేవాడు. టికెట్ లేకుండా ప్రయాణించిన మహిళలను బెదిరించేవాడు. టికెట్ లేకుండా ప్రయాణించటం నేరమని.. అందుకు ఏడాది జైలు తప్పదనేవాడు. తనతో ఏకాంతంగా గడిపితే.. ఎలాంటి శిక్ష పడకుండా చేస్తానని భయపెట్టేవాడు.
దీంతో.. కొందరు మహిళలు అతడికి మాటల్ని నమ్మి అతని లైంగిక వేధింపుల్ని భరిస్తున్నారు. తాజాగా చిన్నతంబి వీధిలోని ఒక లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు శివకుమార్ తో పాటు.. బాధితురాలు దొరికింది. టికెట్ లేకుండా ప్రయాణించే మహిళా ప్రయాణికుల విషయంలో అతగాడు వ్యవహరిస్తున్న తీరుతో షాక్ కు గురైన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ దుర్మార్గానికి సహకరిస్తున్న లాడ్జి మేనేజర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకాలం అమాయకుల్ని బెదిరించి.. భయపెట్టి అత్యాచారాలకు పాల్పడ్డ టీసీ పాపం పండినట్లైంది.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?