కావాలని ఎవరూ తప్పులు చేయరు. అయితే.. తప్పులు జరగటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించటంలోనే అసలు సమర్థత కనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్ర సర్కారులో అలాంటి సమర్థతే మిస్ అయిన భావన కలగక మానదు. ఒక విషయం వివాదాస్పదమై.. ప్రభుత్వం మీద విమర్శల జడివాన కురుస్తున్న వేళ.. ఆ ఇష్యూ మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆ పని చేయటం లేదన్న భావన పలువురి నోట వినిపిస్తోంది.
మిర్చి రైతులు ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర సర్కారు తొలి నుంచి తప్పటడుగులు వేస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే.. మిర్చి రైతులకు గిట్టుబాటు ధరల్ని కల్పించే విషయంలో ఏపీ సర్కారుతో పోలిస్తే.. తెలంగాణ సర్కారే ముందుగా అలెర్ట్ అయ్యింది. అయితే.. కేంద్రం నుంచి వచ్చే సాయంతోనే మిర్చి రైతుల్ని ఆదుకోవాలన్న ఆలోచన.. కేంద్రం దృష్టికి ఇష్యూను తీసుకెళ్లటంతో తమ పని పూర్తి అయ్యిందన్న రిలాక్సేషన్ మొత్తం కొంప ముంచిందని చెప్పాలి. మిర్చి పంటకు ధర తగ్గటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. కేంద్రం ఈ విషయంలో కల్పించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందే తప్పించి.. దాన్ని ఫాలో అప్ చేయటంలో పొరపాటు జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పంట భారీగా మార్కెట్‌కు వచ్చే వేళలో మరింత అలెర్ట్ గా ఉండి.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే.. చాలావరకూ రచ్చ జరగకుండా ఉండిపోయేది. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో అలాంటిదేమీ జరగలేదు. దీంతో.. ఈ ఇష్యూ అంతకంతకూ పెరిగిపోయింది. పంట పండించిన రైతును పట్టించుకోని కేసీఆర్ సర్కారుపై అన్నదాత ఆగ్రహంతో నిరసనలకు దిగటం.. వాటిని కంట్రోల్ చేసే విషయంలో పోలీసుల అత్యుత్సాహం.. వెరసి.. ప్రభుత్వ కార్యాలయాల మీద రైతులు దాడులు చేసే వరకూ వెళ్లింది.
దాడులు చేసిన తర్వాత అయినా.. ప్రభుత్వం రియాక్ట్ అయి.. సామరస్యంగా ఇష్యూను క్లోజ్ చేస్తే బాగుండేది. కానీ.. రైతుల ఆందోళనల వెనుక విపక్షాలున్నాయన్న సమాచారంతో ఆందోళనకారుల పట్ల కాస్తంత కటువుగా వ్యవహరించింది. దీంతో.. రైతులపై భారీ కేసులు నమోదై.. చివరకు వారు జైళ్లల్లోకి వెళ్లేలా చేసింది. ఇది తెలంగాణ సర్కారుపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోవటం తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందన్న భావనతో సమాధానపడిన వారు సైతం.. తాజాగా రైతులకు సంకెళ్లు వేసుకొని కోర్టుకు తీసుకొచ్చిన తీరు చూసి కదిలిపోయారు.
మిర్చి రైతుల ఇష్యూలో తొలి నుంచి తొందరపాటుతో ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. కాస్తంత జాగ్రత్తతో వ్యవహరించి.. అనవసర వివాదాలకు దారి తీసేలా వ్యవహరించకూడదన్న ఒక్క నోటి మాట అధికారులకు సందేశం రూపంలో అందితే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ.. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవటంతో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక సర్కారు అన్న భావన కలిగేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ సర్కారుకు అనుకూలంగా ఉన్నారన్న ప్రచారం సాగుతున్న మీడియాలోనూ.. ఈ రోజు రైతులకు సంకెళ్లే వేసి తీసుకొచ్చిన ఫోటో.. వార్త మొదటి పేజీలో అచ్చేసిన వైనం చూసినప్పుడు.. ఇష్యూ ఎంత తీవ్రంగా మారిందన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.
డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా రైతులకు సంకెళ్లు వేసి తీసుకొచ్చిన వైనంపై తెలంగాణ రాష్ట్ర సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి.. ఈ ఇష్యూ మీద విచారణ జరపాలన్న మాటతో కదిలిన అధికార యంత్రాంగం ఇద్దరు అధికారులపై వేటు పడింది. నిజానికి తుమ్మల గురువారం నాడు స్పందించిన వైనం.. ముందే జరిగి ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. తుమ్మల లాంటి సీనియర్ నేతలు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నప్పటికి చొరవ ఎందుకు తీసుకోవటం లేదన్నది ప్రశ్న. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే మాత్రం ప్రభుత్వం మీద పడిన రైతు వ్యతిరేక మరక చెరిగిపోతుందా తుమ్మల జీ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/