ఔను. ఒకరు కాదు..ఇద్దరు కాదు...ఒక ప్రాంతం కాదు..ఒక రాష్ట్రం కూడా కాదు...దేశం అంతా...ఐఫోన్లు పగలగొట్టేస్తున్నారు. ఖరీదైన ఈ ఫోన్లను రహస్యంగా ఏమీ పగలగొట్టడం లేదు బహిరంగంగానే చేస్తున్నారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కోపంతో చేస్తున్నారు. ఇంతకీ ఏ దేశంలో ఇలా జరుగుతోందంటే..టర్కీలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి దిగుమతయ్యే ఉక్కుపై హెచ్చుస్థాయిలో సుంకాలు విధించినందుకు వారు ఆవిధంగా నిరసన తెలియజేస్తున్నారు. టర్కీ అధ్యక్షుడు రెచ్చిప్ ఎర్దొగాన్ అమెరికాపై చేపట్టిన వాణిజ్య ప్రతీకార చర్యలకు టర్కీ ప్రజలు రకరకాలుగా మద్దతు తెలుపుతున్నారు.
తమ దేశ అధ్యక్షుడికి మద్దతుగా - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా టర్కీ ప్రజలు విదేశీవస్తు విధ్వంసం ఉద్యమం చేపట్టారు. ఐఫోన్లను కొనేందుకు ఒకప్పుడు షాపుల ముందు బారులు తీరిన టర్కీ ప్రజలు ఇప్పుడా ఐపోన్లపైనే తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య ప్రతిబంధక విధానాలపై మండిపడుతూ టర్కీ పౌరులు కొత్తరకం ఆందోళన చేపట్టారు. ఐఫోన్లను టర్కీ ప్రజలు పబ్లిగ్గా నడిరోడ్డుపై సమ్మెటలతో బద్దలు కొట్టి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. కొందరు కోక్ బాటిల్స్ ను తొక్కిన వీడియోలు పెడితే మరికొందరు అమెరికా డాలరును చించేసిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. అమెరికా ప్రకటించిన వాణిజ్యయుద్ధంపై నిరసనగా ఈ చర్య చేయడం ఆసక్తికరంగా మారింది.
కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఆంక్షలు విధించడంతో..టర్కీ కరెన్సీ లీరా దారుణంగా పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే.. లీరా వాల్యూ 7.24గా నమోదు అయ్యింది. లీరా విలువ తగ్గడంతో యూరోప్ లో మార్కెట్లు షేక్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కువ శాతం యూరోప్ దేశాలు.. టర్కీకి రుణాలు ఇచ్చాయి. ఈ ఏడాదిలోనే లీరా కరెన్సీ విలువ సుమారు 45 శాతం పడిపోయింది. లీరా పడిపోవడం వల్ల యూరోకు కూడా ముప్పు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు టర్కీ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అన్ని బ్యాంకులకు కావాల్సినంత నగదును అందిస్తామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.
Full View