మ‌హిళ‌ల‌కు సెక్స్ క‌న్నా టీవీలే ముఖ్య‌మ‌ట‌!

Update: 2017-11-05 07:26 GMT
మ‌గ‌వాళ్లు ఏదైనా సాధించాలంటే పెళ్ల‌య్యే లోపే సాధించాలి....పెళ్ల‌య్యాక పెళ్ళాం చేతిలో రిమోట్ కూడా తీసుకోవ‌డానికి వీలుండ‌దు...ఇది చాలా మందికి తెలిసిన‌ స్టేట్ మెంటే. వాస్తవానికి భార్య‌లు..... త‌మ భ‌ర్త‌ల క‌న్నా టీవీ రిమోట్ ల‌కే అధిక ప్రాధాన్య‌మిస్తున్నార‌ట‌. అంతేకాదు, టీవీ కార్య‌క్ర‌మాలు, సీరియ‌ళ్లు చూసిన త‌ర్వాతే భ‌ర్త‌ల గురించి ప‌ట్టించుకుంటున్నార‌ట‌. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే టీవీ కావాలా? భ‌ర్త‌తో సెక్స్ కావాలా? అని అడిగితే....ఠీవీగా కూర్చొని టీవీ చూస్తాం....అని మ‌హిళా మణులు బ‌దులిస్తున్నార‌ట‌. అధునిక కాలపు అతివ‌ల అభిరుచుల గురించి తెలుసుకునేందుకు మోర్టార్ లండన్ అనే స్వచ్చంధ సంస్థ ఓ స‌ర్వేను నిర్వ‌హించింది. ఆ స‌ర్వేలో అనేక మ‌హిళ‌ల అభిరుచుల గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.  

గ‌తంలో మ‌హిళ‌లు ఇంటిప‌ని, వంట‌ప‌ని పూర్తి చేసుకున్నాక కాల‌క్షేపం కోసం టీవీల ముందు కూర్చునేవారు. అయితే, ప్ర‌స్తుతం ఆ ట్రెండ్ మారింది. అన్ని ప‌నుల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ మ‌హిళ‌లు టీవీ సెట్ ల‌కు అతుక్కుపోతున్నార‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు తెలుగు రాష్ట్రాల్లో మ‌హిళామ‌ణులు సీరియ‌ళ్లు చూస్తున్న స‌మ‌యంలో త‌మ భ‌ర్త‌ల‌కు క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదు. కొంత‌మంది భ‌ర్త‌లైతే, చేసేదేమీలేక ఆ సీరియ‌ళ్లు చూసేస్తున్నారు. అయితే, 20 శాతం మంది మహిళలు, సెక్స్ కంటే టీవీ కార్యక్రమాలు చూడ‌డానికే మొగ్గు చూపుతున్నార‌ని ఆ స‌ర్వేలో తేలింది. ఎక్కువ స‌మ‌యం టీవీ చూసేవాళ్లలో 61 శాతం మంది తమ జీవితంలో కీల‌క‌కమైన నిర్ణయాల్ని టీవీ చూస్తూనే తీసుకున్నార‌ట‌. పెళ్లి, ఉద్యోగం, కెరీర్ ల‌కు సంబంధించిన డెసిష‌న్స్ ను వారు ఎంచ‌క్కా టీవీ రిమోట్ చేతిలో ప‌ట్టుకొనే ఫైన‌ల్ చేశార‌ట‌. ఈ ప‌రిస్థితి ఏవో కొన్ని ప్రాంతాల‌కో, దేశాల‌కో ప‌రిమితం కాలేద‌ట‌. ప్రపంచంలో 7 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరు టీవీతో అనుబంధాన్ని క‌లిగి ఉన్నారని స‌ర్వేలో తేలింది.
Tags:    

Similar News