లాక్ డౌన్ వేళ అన్నీ బంద్ అయిపోయాయి.. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. వ్యాపార, వాణిజ్యాలు బంద్ అయి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. జనాలంతా ఇంటికే పరిమితం కావడంతో ఏ వ్యాపారం ముందుకు సాగడం లేదు. కానీ లాక్ డౌన్ వేళ టీవీ ఇండస్ట్రీ తోపాటు స్ట్రీమింగ్ యాప్స్ మాత్రం కళకళలాడుతున్నాయి. చాలా మంది ఇంట్లో రోజంతా టీవీ చూస్తూ, స్టీమింగ్ యాప్స్ చూస్తూ గడిపేస్తున్నారు.
తాజాగా స్ట్రీమింగ్ యాప్స్ కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సరిలేరు’ను అమేజాన్ ప్రైమ్ వేస్తోంది. ఇక నెట్ ఫిక్స్ మంచి మసాలా సినిమాను సిద్ధం చేసింది. కొత్త అల్లు అరవింద్ లాంచ్ చేసిన ‘ఆహా’ స్ట్రీమింగ్ యాప్ సైతం మెగా హీరోల సినిమాను అందులో ఉంచుతోంది. ఇక సన్ నెక్ట్స్, జీ5 లు కూడా సరికొత్త ధారవాహికలు, సినిమాలతో ఆడియెన్స్ ను కట్టి పడేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులంతా అయితే టీవీలు.. లేదంటే కొత్త సినిమాల కోసం స్ట్రీమింగ్ యాప్స్ కు అతుక్కుపోతున్నారు.
దేశంలో తాజాగా లెక్కల ప్రకారం టీవీ రేటింగ్స్ పీక్స్ లో ఉన్నాయి. టీవీ వీక్షణం ఏకంగా రికార్డు స్థాయిలో 37శాతం పెరిగినట్లు ‘బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)’ గురువారం ప్రకటించింది. లాక్ డౌన్ కావడంతో టీవీ రేటింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని బార్క్ చీఫ్ ఎగ్జి క్యూటివ్ సునీల్ లుల్లా తెలిపారు.
ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సీరియల్స్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీంతో టీవీల్లో పాత సీరియళ్లు రామాయణం, శక్తిమాన్ లు వేస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ వేస్తున్నారు. ఇక కొత్త సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలను తిరిగి వేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఆసక్తితో టీవీలకే అతుక్కు పోతున్నారు. నాన్ ప్రైమ్ టైమ్ లో కూడా వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని బార్క్ తెలిపింది. కాలక్షేపం లేక జనాలు టీవీలకు అతుక్కు పోతుండడంతో టీవీ రేటింగ్స్ విపరీతంగా పెరిగి పోతున్నాయి.
ఇలా ప్రస్తుతం లాక్ డౌన్ తో ఇళ్లలో ఉన్న జనాలకు టీవీలు, స్ట్రీమింగ్ యాప్స్ దిక్కవుతున్నాయి. ప్రేక్షకులను రంజింప చేయడానికి అవి కూడా సరికొత్త సీరియళ్లు, సినిమాలు తీసుకొస్తూ అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది..