అండ‌ర్ గ్రౌండ్ లోకి ర‌విప్ర‌కాశ్‌?

Update: 2019-05-12 05:17 GMT
టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ఇప్పుడెక్క‌డ‌? అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఆయ‌న ఆచూకీ తెలియ‌టం లేదు. ఆయ‌న ఫోన్ స్విచాఫ్ లో ఉన్న‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీంతో.. ఆయ‌న అండ‌ర్ గ్రౌండ్ కు వెళ్లిన‌ట్లుగా భావిస్తున్నారు.  టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ పైన ఫోర్జ‌రీ త‌దిత‌ర కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ‌కు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.అయిన‌ప్ప‌టికీ ర‌విప్ర‌కాశ్ ఇప్ప‌టివ‌ర‌కూ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ర‌విప్ర‌కాశ్ ఇంటికి పోలీసులు వెళ్లారు.

ఆయ‌న ఇంట్లో లేర‌ని.. బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు ఇంట్లోని కుటుంబ స‌భ్యులు చెప్పిన‌ట్లుగా తెలిసింది. ఇదిలా ఉంటే.. పోలీసుల విచార‌ణ‌కు ర‌విప్ర‌కాశ్ స‌హ‌కరిస్తార‌ని.. ఆయ‌న‌కు ప‌ది రోజుల గ‌డువు కావాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది పోలీసుల‌ను కోరిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. టీవీ9 ఉద్యోగులు కొంద‌రిని విచార‌ణ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్లుగా తెలుస్తోంది. ర‌విప్ర‌కాశ్ ఆచూకీ తెలియ‌క‌పోవ‌టంతో ఆయ‌న అండ‌ర్ గ్రౌండ్ కి వెళ్లిన‌ట్లుగా భావిస్తున్న‌ట్లుగా విచార‌ణ అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఆయ‌న ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రోవైపు టీవీ9 మాజీ సీఎఫ్ వో మూర్తిని పోలీసులు రెండో రోజు విచారించారు. టీవీ9 లో ఎవ‌రు షేర్లు కొన్నారు?  ఆర్థిక వ్య‌వ‌హారాలు స‌క్ర‌మంగా ఉన్నాయా?  ఫోర్జ‌రీ లేఖ‌ను ఎవ‌రు త‌యారు చేశారు?  లాంటి ప్ర‌శ్న‌లు కొన్ని సంధించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. న‌టుడు శివాజీ సైతం పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు  కాక‌పోవ‌టాన్నిసీరియ‌స్ గా తీసుకొని.. అత‌డికి మ‌రోసారి నోటీసులు ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అప్ప‌టికి  హాజ‌రుకాకుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు. మొత్తంగా ర‌విప్ర‌కాశ్ ఆచూకీ బ‌య‌ట‌కు రాక‌పోవ‌టం.. ఆయ‌న ఫోన్ స్విచాఫ్ లో ఉండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News