బ్లూ టిక్ కు ఫీజు.. కట్టినోళ్లకు ట్విటర్ ఇచ్చే ఆఫర్లు ఇవేనట

Update: 2022-11-03 09:30 GMT
ఇంతకాలం సోషల్ మీడియా ఖతాగా నిలిచి.. ఉచిత సేవల్ని అందించిన ట్విటర్ ఇప్పుడు తన తీరును మార్చుకుంటోంది. ట్వీట్ పిట్టను తన అరచేతిలో ఒడిసిపట్టుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ సంస్థ తన చేతికి వచ్చినంతనే.. కంపెనీకి చెందిన ఇద్దరు కీలక ఉద్యోగుల్ని అవమానకరంగా ఇంటికి పంపేయటమే కాదు.. మిగిలిన ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టి.. అత్యంత దారుణంగా పని చేయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంతకాలం ట్విటర్ ఖాతాకు డబ్బులు వసూలు చేయటం లాంటివి లేకున్నా.. ఎలాన్ మస్క్ చేతిలోకి వచ్చినంతనే.. బ్లూ టిక్ ఉండే ఖాతాల వారు నెలవారీగా డబ్బులు కట్టాలని డిసైడ్ చేయటం గమనార్హం.

దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నా.. ఎలాన్ మాస్క్ మాత్రం తగ్గేదేలే అన్న రీతిలో స్పందిస్తున్నారు. బ్లూ టిక్ ఉండే ప్రముఖులు నెల వారీగా ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కొందరు 20 డాలర్లు అంటే.. మరికొందరు 8 డాలర్లుగాచెప్పటం తెలిసిందే.

ఇంతకూ ఈ నెలవారీ ఫీజ్ ఎంత? అన్న విషయంలోకి వెళితే.. మరింత క్లారిటీ ఇస్తున్నారు. ట్విటర్ లో బ్లూ టిక్ ఖాతా ఉన్న వారు తాము ప్రాతినిధ్యం వహంచే దేశాలకు తగ్గట్లుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 8 డాలర్లు తప్పనిసరి.. ఆయా దేశాలకు అనుగుణంగా ఫీజుల్ని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

బ్లూ టిక్ ఖాతాలు ఉన్న వారి మీద ఫీజు భారం వేసినప్పటికీ.. అందుకు తగ్గ సదుపాయాల్ని కూడా కల్పిస్తున్నట్లుగా ట్విటర్ చెబుతోంది. బ్లూ టిక్ ఉన్న యూజర్లు ఇకపై రిప్లైలు.. మెన్షన్లు.. సెర్చిల్లో మరింత ప్రాధాన్యతను కల్పిస్తామని చెబుతున్నారు. అంతేకాదు.. స్పామ్ లు.. స్కామ్ ల బెడద తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. గతంలో మాదిరి కాకుండా.. కాస్తంత నిడివి ఎక్కువగా ఉన్న వీడియోలు.. ఆడియోల్ని పోస్టు చేసుకునే వీలు కల్పిస్తారు.

ప్రకటనల సంఖ్య కూడా భారీగా తగ్గుతాయన్న విషయాన్ని ఎలాన్ ప్రత్యేకంగా చెబుతున్నారు. ఫీజు వసూలు చేయటమే కాదు.. అందుకు తగ్గట్లు వసతుల్ని పెంచనున్నామన్న ఎలాన్ మస్క్ వ్యవహారం చూసినప్పుడు.. ట్విటర్ ను భారీ ఆదాయ వనరుగా మార్చుకోవటానికి ప్లానింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన స్పష్టత రానున్న రోజుల్లో జరగనుందని చప్పక తప్పదంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఎలాన్ మాస్క్ డిసైడ్ చేసిన సరికొత్త వెంచర్ పై ప్రపంచ వ్యాప్తంగా పలువురు తప్పు పడుతున్నారు. బ్లూ టిక్ కొనసాగాలంటే డబ్బులు చెల్లించాలన్న ఎలాన్ మాస్క్ నిర్ణయాన్ని పలువురుప్రముఖులు తప్పు పడుతున్నారు. నిజానికి తమకున్న ఫాలోవర్లకు ట్విటరే స్వయంగా తనకు డబ్బులు ఇవ్వాలన్న వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖులు ఉన్నారు. మొత్తంగా బ్లూ టిక్ ఉన్న వారి నుంచి నెలవారీగా డబ్బులు వసూలు చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News