కరోనా వైరస్ ...ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతుంది. ముఖ్యంగా ఈ వైరస్ అమెరికా లో వేగంగా విస్తరిస్తూ .. అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తుంది. ఈ కరోనా పై ప్రస్తుతం ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలెబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు తమకి తోచిన విదంగా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడికి కోసం ట్విటర్ సీఈఓ జాక్ డార్సీ ఒక బిలియన్ డాలర్ల (వంద కోట్లు) భారీ విరాళం ప్రకటించారు.
కరోనా సహాయక చర్యలకు మద్దతుగా ఈ నిధులను అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలిపారు. తన సంపదలో 28 శాతం తన ఛారిటీ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్ ఎల్ సి ద్వారా గ్లోబల్ కరోనా రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు డోర్సే ట్వీట్ చేశారు. ప్రజలకు సహాయ పడటానికి ఈ రోజు మనం చేయగలిగినదంతా చేద్దామని, తన నిర్ణయం ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తున్నానంటూ తెలిపారు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జాక్ డోర్సీ.. తన దాతృత్వానికి సంబంధించిన వివరాలను ఇంతకాలం గోప్యంగా ఉంచారు. కానీ ఇకపై స్వచ్చంధ సంస్థ ద్వారా చేయబోయే వ్యయాలన్ని ప్రజలకు అందుబాటు లో ఉంటాయని తెలిపారు. ఇక ప్రఖ్యాత పోర్బ్స్ మ్యాగజీన్ ప్రకారం.. డోర్సీ మొత్తం ఆస్తి విలువ 3.3 బిలియన్ డాలర్లు అంటే రూ.25 వేల కోట్లు.