ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు ఎలన్ మస్క్ చేతుల్లో పడ్డాక ట్విట్టర్ భ్రష్టు పట్టిపోయింది. అసలు ఆయన చేస్తున్న సంస్కరణలతో ట్విట్టర్ సంక్షోభంలో పడింది. ఇక ట్విట్టర్ నడుస్తుందా? లేదా? అని ప్రపంచవ్యాప్తంగా డౌట్ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎలన్ మస్క్ కంపెనీని కొనేసిన రెండు వారాల్లోనే సగంమందిని ఉద్యోగంలోంచి తీసేశారు.
మిగిలిన సగం మందితోనే అన్నీ పనులు చేయాలని హుకూం జారీ చేశాడు. రకరకాల కండీషన్లు పెట్టాడు. చేస్తే చేయండి.. లేదంటే వెళ్లిపోండి అని గదాయించాడు.
దీంతో ట్విటర్ ఉద్యోగులు అంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఎలన్ మస్క్ కు గట్టి షాకిచ్చారు. సోషల్ మీడియాలో ట్విటర్ ఉద్యోగులు మస్క్ మీద ఏదైనా అభిప్రాయం చెబితే వెంటే వారిని తీసివేస్తున్నారు. దీంతో ఇంత టార్చర్ భరించలేమంటూ మిగిలిన సగం మంది ట్విటర్ ఉద్యోగులు సామూహిక రాజీనామాల బాటపట్టారు. ఏం జరుగుతుందో అర్థం అయ్యే సరికి మస్క్ కు షాక్ తగిలింది.
సంస్థను వీడుతున్న ట్విటర్ ఉద్యోగులే ఇప్పుడు ‘ట్విటర్ కు ఎలన్ మస్క్ సమాధి కట్టాడంటూ’ ట్రెండ్ చేస్తున్నారు. వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం మొదలైన ఈ రాజీనామాల పర్వం, ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ట్విట్టర్ లోనే తమ నిరసననను తెలియచేస్తున్నారు. ‘రిప్ ట్విటర్’ ట్రెండింగ్ గా మారింది.
సోమవారం వరకూ కార్యాలయాలను మూసేస్తున్నామని.. బ్యాడ్స్ యాక్సెస్ ను కట్ చేస్తామని ట్విటర్ తన ఉద్యోగులకు తెలిపినట్టు మసాచారం. గురువారం సాయంత్రం ట్విటర్ సెక్యూరిటీ సిబ్బంది ఆ కంపెనీలోని ఉద్యోగులను బయటకు పంపేస్తున్నారని తెలిపాయి. ట్విటర్ యాజమాన్యాన్ని చేపట్టిన వెంటనే ఎలన్ మస్క్ సగం మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం 7500మంది ఉద్యోగుల్లో సగం మంది బాధితులుగా మిగిలారు. గురువారం సాయంత్రానికి కంపెనీలో దాదాపు 2900మంది మాత్రమే మిగిలినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.