ప్రత్యేకదేశంగా కశ్మీర్.. ట్విట్టర్ పై కేంద్రం సీరియస్?

Update: 2021-06-28 14:30 GMT
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఆగడాలకు అంతే లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను అమలు చేయకుండా మొండికేస్తున్న ట్విటర్ కు ఇప్పటికే కేంద్రం నోటీసులు జారీ చేసింది. రక్షణ హోదాను తీసేసింది. అయినా కూడా ట్విటర్ కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతుల ఖాతాలను బ్లాక్ చేస్తూ అతి చేస్తోంది. ఇప్పుడు ఏకంగా భారతదేశానికి చెందిన కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా చూపించి మరోసారి ధిక్కారానికి పాల్పడింది.

భారత్ లోని కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా, లఢక్ ను చైనాలో భాగంగా చూపిస్తూ ట్విట్టర్ మరోసారి ధిక్కారానికి పాల్పడింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లఢఖ్ లను వేరే దేశంగా చూపి.. భారతదేశ పటాన్నే ట్విటర్ వక్రీకరించడం దుమారం రేపింది.

ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలు అమలు చేయకుండా కేంద్రప్రభుత్వంతో పైట్ చేస్తోంది ట్విటర్. ఎన్ని నోటీసులు ఇచ్చినా స్పందించకుండా మొండికేస్తోంది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించడం పెను దుమారం రేపింది. తాజా చర్యతో కేంద్రం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ట్విటర్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు  బీజేపీ సర్కార్ రెడీ అవుతున్నట్టుగా అధికార వర్గాలు అంటున్నాయి.

ట్విటర్ లోని 'ట్వీప్ లైఫ్' అనే సెక్షన్ లో జమ్మూకశ్మీర్, లఢక్  ప్రాంతాలను భారత్ లో భాగంగా చూపించకుండా ప్రత్యేక దేశంగా ట్విటర్ చూపించింది. దీనిపై భారతదేశ నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలోనూ లేహ్ ను చైనాలో భాగంగా తప్పుగా గుర్తించారని.. ఇప్పుడు ట్విటర్ అతి చేస్తోందని.. కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  ట్విట్టర్ కు, కేంద్రప్రభుత్వానికి మధ్య కొద్దిరోజులుగా యుద్ధమే నడుస్తోంది. కేంద్రం తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను ట్విటర్ అమలు చేయడం లేదు.ఇక కేంద్రమంత్రులను అవమానిస్తూ వారి ఖాతాలు బ్లాక్ చేస్తోంది. ట్విట్టర్ తీరుపై కేంద్రం సీరియస్ గా ఉంది.. దేశంలో బాధ్యులను నియమించకుండా.. కేంద్రప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ట్విట్టర్ పై  ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే చివరి నోటీసులు జారీ చేసి  ట్విట్టర్ ను సేఫ్ హార్బర్ నుంచి తొలగించింది. తాజా చర్యతో నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News