ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటికీ పలు సంచనాలకు నాంది పలుకుతున్నారు. ట్విట్టర్ సీఈవో నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వేలాది మంది ఉద్వాసన పలికి ఎలాన్ మాస్క్ తనదైన ముద్రను ట్విట్టర్ పై వేస్తూ ముందుకెళుతున్నాడు. ట్విట్టర్ ఆదాయ వనరుగా మార్చే క్రమంలోనే ఖాతాదారులపై భారం మోపుతున్నాడు.
ట్విట్టర్ బ్లూ టిక్ వేరికేషన్ పేరిట ఒక్కొక్కరి నుంచి $8 డాలర్లను సబ్ స్క్రిష్షన్ పేరిట వసూలు చేస్తున్నాడు. దీనిని వినియోగదారులు ధృవీకరించు కోవాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారం మొత్తం గందరగోళంగా మారడంతో ట్విట్టర్ ఖాతాదారులు ఈ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతున్నారు. అయితే వీటన్నింటిని ఎలాన్ మాస్క్ ఏమాత్రం లెక్క చేయకుండా లేదు.
తాజాగా మరోసారి బ్లూ టిక్ వెరిఫై ప్రీమియం ఛార్జీలను మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాడు. ట్విట్టర్ యాప్ వాడే వినియోగదారులు 11 డాలర్లు.. వెబ్ సైట్ ట్విట్టర్ యాప్ వాడే వినియోగదారుల నుంచి 7 డాలర్లను వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫామ్ ధరలపై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది.
ఇకపోతే ట్విట్టర్ నుంచి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్న ఎలాన్ మాస్క్ ఖాతాదారుల కోసం వైన్ యాప్ ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైన్ యాప్ తిరిగి తీసుకు రావాలా.. వద్దా? అని ఎలాన్ మాస్క్ ట్విటర్లో పోల్ నిర్వహించగా మెజార్టీ వినియోగదారులు వైస్ యాప్ కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ సిబ్బందికి త్వరలో వైన్ యాప్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.
మరోవైపు గూగూల్.. ఆపిల్ సంస్థలు గూగూల్ స్టోర్ నుంచి ట్విట్టర్ ను బూట్ చేస్తే ఈ కంపెనీలకు ధీటుగా కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోస్తానని ప్రకటించి సంచలనం సృష్టించాడు.
ఇకపోతే ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను కేవలం ఆదాయ వనరుగా చూస్తూ ఖాతాదారుల భారం మోపుతుండటంపై వారంతా అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు పెద్ద సంఖ్యలో ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.