ట్విట్టర్ వర్సెస్ కేంద్రం.. ఫైట్ షురూ

Update: 2021-05-27 13:30 GMT
కేంద్రప్రభుత్వం తీరుపై ట్విట్టర్ మండిపడింది.  భారత ప్రభుత్వం జారీ చేసిన కొత్త డిజిటల్ నిబంధనలపై ట్విట్టర్ మొదటిసారిగా స్పందించింది. కేంద్రంపై వార్ షూర్ చేసింది.

'కాంగ్రెస్ టూల్ కిట్' వ్యవహారంలో ప్రభుత్వం తమను  టార్గెట్ చేస్తోందని.. పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటన స్వేచ్ఛపేరుతో ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం ప్రకారం తాము నడుచుకుంటామని అంటూ తీవ్రపదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడింది.

ఫ్రీ ఓపెన్ కన్ఫర్మేషన్ కు అనువుగా రూల్స్ ను మార్చాలని కోరుతున్నామని.. ఇందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది. ఇండియాలో ట్విట్టర్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఆఫీసర్లను నియమించాలని.. వారి చిరునామానాలు తెలియజేయాలని.. అభ్యంతకర కంటెంట్  తొలగింపునకు మెకానిజం ఉండాలని.. ఇలా పలు నిబందనలు విధించిన అనంతరం దీనిపై ఒక సంస్థ ప్రతినిధి ఒకరు ఘాటుగా స్పందించారు.

ఇండియాలోని తమ సంస్థ ఉద్యోగుల విషయంలో తాము ఆందోళన చెందుతున్నామని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. ఈ విపత్తు వేళ ప్రజలకు అండగా ఉంటామని.. భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.కానీ ట్విట్టర్ ఇదే సమయంలో ప్రైవసీని భావ ప్రకటనా స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకొని ప్రతివాణిని వినిపించుకోగలుతున్నామని ఆయన తెలిపారు.

-అసలు వివాదం ఇదీ
'కాంగ్రెస్ టూల్ కిట్' వ్యవహారంలో కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ నేపథ్యంలో తన ట్యాగ్ ను తొలగించాలని ట్విట్టర్ ను బీజేపీ ప్రభుత్వం కోరింది.ఈ సంస్థకార్యాలయాలపై పోలీసులతో దాడులు చేయించింది. ఉద్యోగులకు సంజాయిషీ నోటీసులు జారీ చేయడంతో ట్విట్టర్ దీనిపై మండిపడింది.
Tags:    

Similar News