టాప్ సీక్రెట్ : ఆ మంత్రి ఖాతాలోకి నెలకు రెండు కోట్లు!

Update: 2019-07-31 10:30 GMT
మన వ్యవస్థ అవినీతికి ఎంతలా అలవాటు పడిపోయిందో చాటి చెప్పే ఉదంతం ఇది. తనకు నెలకు రెండు కోట్ల రూపాయల చొప్పున కిక్ బ్యాక్స్ వస్తుంటే ఒక మంత్రి ఆశ్చర్యపోతూ ఉన్నారట! తను అడిగింది లేదు, డిమాండ్ చేసిందే లేదు.. అయినా అంత డబ్బు ఆయన వద్దకు చేరిపోతోందట!

ఇటీవలే మంత్రి పదవిని స్వీకరించిన ఆయన తన వద్దకు పెట్టుకోమంటూ వచ్చే డబ్బును చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారట. అదేమని ఆయన ఆరా తీస్తే.. అదంతే  అంటున్నారట అధికారులు! పాలనలో అది కూడా ఒక కీలక శాఖ. ఆ శాఖలో అవినీతి ఎప్పుడూ పతాక స్థాయిలోనే ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా, రాష్ట్రం ఏదైనా ఆ శాఖ అంటేనే అవినీతి కంపు ఉంటుంది. ప్రజల  దగ్గర నుంచినే వసూళ్లు స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి స్థాయిని బట్టి కోట్ల రూపాయలు దక్కుతాయి.

ఆ శాఖలో పని చేసే అధికారులు ఆ తరహా వసూళ్లకు పాల్పడతారు. కావాల్సినంత దండుకుంటారు. తాము  దండుకోవడమే కాదు. తమ పై వాళ్లకు  కూడా వాళ్లు వాటాలు పంపుతారు. ఆ శాఖలో ప్రతి అధికారీ తన స్థాయికి తగ్గట్టుగా సంపాదించేయగలడు. అలా సంపాదించిన సొమ్మును పై వారికి వాటాలుగా పంపే సంప్రదాయం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. అదే ఇప్పుడూ  సాగుతోందట.

అందులో భాగంగా కొత్త మంత్రి తనకు నెలకు రెండు కోట్ల రూపాయల వరకూ ముడుతుండే సరికి ఆశ్చర్యపోతూ ఉన్నాడట. తను కోరకపోయినా అలా డబ్బు వచ్చిపడుతోందట. తన ప్రమేయం లేకుండానే ఆ డబ్బు వస్తుండటంతో, అది కాదనలేనంత స్థాయిలో ఉండటంతో ఆయన కూడా కామ్ అయిపోతూ ఉన్నాడని టాక్!
    

Tags:    

Similar News