తెలంగాణలో తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా

Update: 2020-03-26 13:03 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వణికిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే....ఎటువైపు నుంచి కరోనా సోకుతుందో అన్న అనుమానంతో దేశ ప్రధానులు - వీవీఐపీలు సైతం వణికిపోతున్నారు. మన దేశంలో సింగర్ కనికా కపూర్ వ్యవహారంతో ఎంపీలు - రాష్ట్రపతి కోవింద్ కూడా టెస్ట్ లు చేయించుకున్నారు. ఇక, ప్రిన్స్ చార్లెస్ కూ కరోనా పాజిటవ్ రావడంతో కరోనాకు కారెవ్వరు అనర్హుహులు అన్న మాట వినిపిస్తోంది.ఇక, తెలంగాణలో కరోనా నానాటికి వ్యాప్తి చెందుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా సోకడంతో ఊపిరి పీల్చుకున్న తెలంగాణ సర్కార్ ....తాజా ఉదంతం ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా తెలంగాణలో ఇద్దరు వైద్యుల సహా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో టీ సర్కార్ ఆందోళన చెందుతోంది. ఆ మూడు కేసులు కరోనా కాంటాక్ట్ కేసులు కావడం మరింత కలవరపెట్టే అంశం. దీంతో, ప్రైమరీ కాంటాక్ట్ కేసుల సంఖ్య 9కి చేరగా...మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది.

తెలంగాణలో తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నుంచి వచ్చిన కుత్బుల్లాపూర్ నివాసికి - దోమల్ గూడకు చెందిన ఇద్దరు వైద్యులకు కరోనా సోకిందని నిర్ధారణ అయింది. ఈ ముగ్గురికి ఫారిన్ వెళ్లినట్లు ట్రావెల్ హిస్టరీ లేదు. దీంతో, ఈ మూడు కేసులు ప్రైమరీ కాంటాక్ట్ కేసులు అని వైద్యులు నిర్ధారించారు. కరోనా పాజిటివ్ వ్యక్తికి దగ్గరగా ఉండడం వల్ల ఈ వైద్య దంపతులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ మూడు కేసులతో ప్రైమరీ కాంటాక్ట్ కేసులు 9కి చేరింది. మొత్తంగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఆ వైద్యులకు రోగి నుంచే కరోనా సంక్రమించిందా లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.


Tags:    

Similar News