వైసీపీలో ఆ ఇద్దరూ... దగ్గరపడుతోందా...?

Update: 2022-12-06 11:30 GMT
అధికారంతముల చూడవలె అయ్యవారి వెలుగులు అని చెబుతూ ఉంటారు. ఒకసారి పవర్ అనే వెలుగు ప్రసరించకపోతే ఎంతటి స్థాయి నాయకుడు అయినా అమావాస్య చంద్రుడే అవుతాడు. అందుకే అధికారంలో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు. వారు వెలుగులో ఉంటారు. చుట్టూ కోట్ల కన్నులు అన్నీ చూస్తాయి, గమనిస్తాయి.

 పవర్  చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతే తరువాత అధికారం పోయాక వారి పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇపుడు అలాంటి భయాందోళనలో వైసీపీలో ఇద్దరు కీలక నాయకులు ఉన్నారని అంటున్నారు. వారిద్దరూ ఎవరో కాదు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఈ ఇద్దరిలో నాని 2014 కి నుందే టీడీపీకి షాక్ ఇచ్చేసి వైసీపీలో చేరారు. వరసగా రెండు ఎన్నికల్లో గెలిచి మంత్రి కూడా అయ్యారు.

అయితే కొడాలి నాని ఏకంగా చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని అనుచితమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. దాదాపుగా మూడేళ్ళ పాటు నాన్ స్టాప్ గా నాని బాబు మీద డైరెక్ట్ అటాక్ చేస్తూ ఆయనను మానసిక క్షోభకు గురి చేశారు అని అంటారు. ఇక మరో వైపు చూసెత 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ పార్టీని వదిలేస్ది వైసీపీకి అండగా నిలబడ్డారు. ఆయన అయితే ఏకంగా చంద్రబాబు సతీమణి మీదనే కొన్ని అనుచిత కామెంట్స్ చేశారు. ఫలితంగా బాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఏడ్చారు కూడా.

ఆ తరువాత ఈ ఇద్దరు నాయకుల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సొంత సామాజిక వర్గంలో వారు కూడా వారిని దూరం పెట్టారు అని ప్రచారం జరిగింది. దాంతో వంశీ తన మాటలకు క్షమాపణ చెప్పుకుని తగ్గారు. ఇక కొడాలి నాని అయితే వ్యతిరేకతను గమనించి ఇటీవల కాలం ఎక్కడా సౌండ్ చేయడంలేదు. కానీ ఇంతలో జరగాల్సింది అంతా జరిగిపోయింది.

ఇపుడు చూస్తే వైసీపీ వ్యతిరేక పవనాలు అంతటా వీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా అన్న భయం అయితే ఈ ఇద్దరు నాయకులకు ఉంది అంటున్నారు. ఇక గన్నవరంలో చూస్తే వంశీకి టికెట్ వద్దు అని సొంత పార్టీ నుంచే అంటున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని చెబుతున్నారు. పార్టీలో చిరకాలంగా పనిచేస్తూ వస్తున్న వారు తమకే టికెట్ అంటున్నారు. ఒకవేళ వారి మాటలను పక్కన పెట్టేసి వంశీకి టికెట్ ఇచ్చినా ఆయన గెలవడం కష్టమని అంటున్నారు.

అలాగే కొడాలి నానికి తిరుగులేదని భావించే గుడివాడలో సైతం సీన్ మెల్లగా మారుతోందిట. గ్రౌండ్ లెవెల్ లో కొడాలి నానికి యాంటీగా సీన్ మారింది అంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లాలని చాలా మంది చూస్తున్నారుట. దానికి తోడు క్యాసినో ఎపిసోడ్ నానిని వెంటాడుతూనే ఉంది. ఈ నేపధ్యంలో నాని మళ్లీ గెలుస్తారా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

అదే టైం లో టీడీఎపీ ఏపీలో అధికారంలోకి వస్తే వంశీకి కొడాలి నానిలను అసలు స్పేర్ చేయమని టీడీపీకి చెందిన నాయకులు అంటుననరు. ముఖ్యంగా వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న లాంటి వారు సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరు నాయకులకు తమ రాజకీయ భవిష్యత్తు మీద బెంగ పట్టుకుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే నెల్లూరు జిల్లాలో ఇక మరో  కీలక నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా చంద్రబాబు మీద నోరు పారేసుకుంటున్నారు. అలాగే ఆయన లబ్దిదారుల మీద కూడా గట్టిగానే నోరు చేస్తున్నారు.

ఆయన వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తోంది అంటున్నారు. మరి ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారా అన్న చర్చ ఉంది. అలాగే నెల్లూరు జిలాలో వైసీపీ రెపరెపలు తగ్గిపోతున్న దాఖలాలు ఉన్నాయని అంటున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత కోటం రెడ్డి తో పాటు ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి మీద కూడా వ్యతిరేకత బాగా ఉంది అంటున్నారు. దీంతో వైసీపీ ఓడి టీడీపీ పవర్ లోకి వస్తే వీరందరికీ ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరు ఏం జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News