కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకానికి పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.
శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్ కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి.
స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు.
ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మరికొందరు యువకులకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆందోళనకారుల దాడిలో అజంతా ఎక్స్ ప్రెస్, శాలిమార్ ఎక్స్ ప్రెస్, ఈస్ట్ కోస్ట్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైలు దహనమయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆరాతీస్తోంది.
రైళ్ల పునరుద్దరణ, ప్రత్యామ్మాయ ఏర్పాట్లపై అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. తాజా ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. అన్ని రైల్వే స్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు.