పురాణాల్లో రాక్షసుల్ని తలపిస్తూ.. డిజిటల్ యుగంలో రాక్షసంగా వ్యవహరించే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు నలుగు భారతీయుల్ని కిడ్నాప్ చేయటం తెలిసిందే. అలా కిడ్నాప్ అయిన వారిలో ఇద్దరు తెలుగువారు (ఒకరు హైదరాబాదీ.. మరొకరు శ్రీకాకుళం జిల్లా టెక్కలి) కాగా.. మరో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారన్న సంగతి తెలిసిందే.
ఐఎస్ తీవ్రవాదుల చేతిలో బంధీలుగా ఉన్న నలుగురు భారతీయుల్లో ఇద్దరు విముక్తం కాగా.. మరో ఇద్దరు భారతీయులు (తెలుగువారు) మాత్రం ఇంకా బంధీలుగా ఉన్నారు. ఐఎస్ తీవ్రవాదుల చేతికి చిక్కిన వారికి చిత్రవిచిత్రమైన మరణ దండన విధిస్తూ నిర్ణయం తీసుకోటం తెలిసేందే. అందుకు భిన్నంగా ఇద్దరు విడుదల కావటం కొంత ఊరటనిస్తున్నా.. మిగిలిన ఇద్దరి విడుదల కోసం భారత సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోన్నట్లు చెబుతున్నారు.
కేంద్రం తన కృషిని కొనసాగించేలా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తిగత స్థాయిలో స్పందించటమే కాదు.. ప్రభుత్వాధికారుల చేత ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయిటం అవసరమన్న విషయాన్ని మర్చిపోకూడదు. కర్ణాటకకు చెందిన ఇద్దరు బయటపడిన తీరులోనే.. తెలుగువారు ఇద్దరూ విముక్తి కావాలని ఆశిద్దాం.