అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకుకున్న యువకుడు.. నెటిజన్ల ట్రోల్స్.. మీమ్స్
ఒక్క పెళ్లి కావడానికే సమాజంలో యువకులు, వారి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతున్నారు. అలాంటిది వీడెవడ్ర బాబూ ఏకంగా ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకేసారి వారి ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు కూడా ఓకే అని ఘనంగా నవ్వుతూ తాళి కట్టించుకున్నారు ఈ వింత పెళ్లి మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ అపూర్వ వివాహ ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తాలూకాలో ఐటీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉన్న అక్కాచెల్లెళ్లు శుక్రవారం ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం.
వరుడు అతుల్ మల్షిరాస్ తాలూకా నివాసి. అతనికి ముంబైలో ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం ఉంది. తండ్రి మరణానంతరం బాలికలు తల్లితో కలిసి జీవించారు. తల్లి అనారోగ్యం పాలైన తర్వాత రింకీ, పింకీలకు అతుల్ మరింత దగ్గరయ్యాడు, అక్కాచెల్లెళ్లకు తోడుగా వారి తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వారి బాగోగులు చూసుకోవడానికి అతడు ప్రాధాన్యమిచ్చాడు. ఆ కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించాడు. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అతుల్ ను ప్రేమించారు. తర్వాత ఇద్దరం అతుల్ నే పెళ్లి చేసుకుంటామని పింకి, రింకీ అనే ఇద్దరు అమ్మాయిలు ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అతుల్ ఇంట్లోనూ అంగీకరించారు. దాంతో వారి పెళ్లి ధూంధాంగా జరిగిపోయింది. పెళ్లి మండపంలో పింకి, రింకీకి అతుల్ తాళి కట్టాడు. వీరి వీడియో వైరల్ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న అతుల్ పై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. అదృష్టం అంటే నీదిరా బాబూ అంటూ మీమ్స్ , ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ విచిత్రమైన వివాహం తరువాత, స్థానిక పోలీసులు ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు, అయినప్పటికీ కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం లేదా బలవంతపు నిర్ణయం గురించి స్పందన లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View Full View Full View

Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt
— Love (@LocalBabaji) December 4, 2022