సాధారణంగా ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సఖ్యతగా ఉంటూ పరస్పరం సహకారం అందించుకుంటుంటారు. ఇక, పక్క పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల మధ్య అయితే, ఆ సహకార బంధం కొద్దిగా గట్టిగానే ఉంటుంది. అయితే, తెలంగాణలోని టీఆర్ ఎస్ పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పక్క పక్క నియోజకవర్గాలకు చెందిన సదరు ఎమ్మెల్యేలు సహకరించుకోవాల్సిందిపోయి. కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతోన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు....అంతిమంగా పార్టీ అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారు. సహకార ఎన్నికల నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన గ్యాప్...రోజురోజుకీ పెరిగిపోయి...కటీఫ్ చెప్పుకునేవరకు వచ్చిందట. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చిన ఆ వ్యవహారం ఏమిటన్నదానిపై పలు ఊహాగానాలు నడుస్తున్నాయి.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి - నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల...మొన్న మొన్నటి వరకు ఈ ఇద్దరు నేతలు కలిసిమెలిసి తిరిగారు. ఉమ్మడి నిజామాబాద్ లోని పక్క పక్క నియోజకవర్గాలకు చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య సొసైటీ చైర్మన్ పదవి వ్యవహారం కోల్డ్ వార్ కు దారి తీసిందట. గణేష్ బిగాల సొంతూరు మాక్లూరు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ గుప్తా తన తండ్రి కృష్ణమూర్తిని డీసీసీబీ ఛైర్మన్ చేయాలని అనుకున్నారు. మాక్లూర్ సొసైటీ ఛైర్మన్ గా తన తండ్రి గెలుపు ఖాయమనుకునే సమయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రంగంలోకి దిగారట. తన అనుచరులకు జీవన్ రెడ్డి సొసైటీ ఛైర్మన్ పదవి ఇప్పించుకోవడంతో గణేష్ గుప్తాకు షాక్ తగిలినట్లయింది. తన తండ్రి కోసం బోధన్ ఎమ్మెల్యే షకీల్ రాయబారం నడిపినా జీవన్ రెడ్డి స్పందించలేదట. అర్బన్ ఎమ్మెల్యే ఆధిపత్యం పెరగకూడదనే ఉద్దేశంతోనే జీవన్ రెడ్డి ఇలా చేశారని టాక్.
మరోవైపు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి..తన పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో ఎప్పుడూ గొడవలేనని ప్రచారం జరుగుతోంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో జీవన్ రెడ్డికి ఇప్పటికే కోల్డ్‌వార్ నడుస్తోందట. మరో పక్క రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కూడా అంతంతమాత్రంగానే సంబంధాలున్నాయట. ఇక, మొన్నటివరకు కలిసి తిరిగిన గణేష్ బిగాలతో కూడా తాజాగా విభేదాలు రావడంతో ఇపుడు పార్టీలో జీవన్ రెడ్డి వ్యవహారశైలి హాట్ టాపిక్ గా మారిందట. ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేయకుంటే...ఈ కోల్డ్ వార్ వల్ల పార్టీకి నష్టమని మిగతా ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట.