వినేందుకు విస్మయానికి గురి చేసినా ఇది నిజం. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విలువ దగ్గర దగ్గర రూ.17వేల కోట్ల వరకూ ఉంటుంది. తొలుత రూ.12వేల కోట్లు అనుకున్నా..చివరకు వచ్చేసరికి భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇంత భారీ మొత్తం ఒక లాటరీ ప్రైజ్ మనీగా మనం ఊహించగలమా? ఏ మాత్రం ఊహించలేనంత భారీ మొత్తంతో నిర్వహించిన లాటరీ విజేతల కార్యక్రమం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
స్పెయిన్ లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఈ లాటరీ విజేత ప్రోగ్రాంను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయటం చూస్తే.. దీనికెంత క్రేజ్ ఉందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఎల్ గొర్డోగా పిలిచే ఈ లాటరీ కాస్త భిన్నమైనది. దీని విజేతలుగా ఉన్న వారికి రూ.3 కోట్ల చొప్పున అందుతాయి. అలా మొత్తం రూ.17వేల కోట్ల మొత్తాన్ని పంచుతారు. మిగిలిన లాటరీ విధానానికి ఇది కాస్త భిన్నమైనది.
ఒకే నంబరు కలిగిన టికెట్లను పెద్ద ఎత్తున అమ్ముతారు. అందులో ఒక నంబరును తుది ఫలితంగా ప్రకటిస్తారు.ఆ నంబరు ఉన్న టికెట్లు ఉన్న వారందరికి రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ.17వేల కోట్లను పంపిణీ చేస్తారు. ఈ ఏడాది లాటరీ 26590 నంబరుకు వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ లాటరీని 1763లో స్టార్ట్ చేశారు.
అప్పటి నుంచి ప్రతి ఏడాది కిస్మస్ కు కాస్త ముందుగా డ్రా తీస్తారు. విజేతలుగా నిలిచిన వారి నెంబరును ప్రకటిస్తారు. ప్రతి ఏడాది డిసెంబరు 22న డ్రా తీసే ఈ లాటరీలో విజేతలుగా నిలిచిన వారికి వచ్చే ప్రైజ్ మనీలో దాదాపు రూ.60లక్షల మొత్తాన్ని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రైజ్ మనీ గెలుచుకున్న వారిలో చాలామంది తమకు లభించిన మొత్తాన్ని దానధర్మాలకు వెచ్చిస్తుండటం. రోటీన్ కు కాస్త భిన్నంగా ఈ లాటరీ ఉంటుందని చెప్పక తప్పదు.