మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ - అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు ప్రధాని మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని, గతంలో యూఏఈ పర్యటనకు వెళ్లిన ఆయన దావూద్ అక్రమాలపై రుజువులను యూఏఈ ప్రభుత్వానికి చూపించారని ఆ మేరకే తాజాగా దావూద్ ఆస్తులను సీజ్ చేశారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తం ఆస్తులను యూఏఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని.. యూఏఈలో దావూద్ కు చెందిన సుమారు రూ. 15,000 కోట్ల ఆస్తులు సీజ్ చేయడం మోడీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య విజయమని, ఇది ప్రధాని నరేంద్రమోడీ మాస్టర్ స్ట్రోక్ అని బీజేపీ నేతలు అభివర్ణించిన సంగతీ తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మాస్టర్ స్ట్రోక్ ఉత్తిదే అని తెలుస్తుంది!
తాజాగా ఈ విషయాలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి అహ్మద్ అల్ బనా స్పందించారు. మోడీ సూచనలతో దావూద్ ఆస్తులపై ప్రభుత్వం దాడులు నిర్వహించిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, అలాంటి దాడులు ఇప్పటివరకూ ఏమీ చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. రూ.15,000 కోట్ల దావూద్ ఆస్తులను సీజ్ చేసినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చిన అహ్మద్ అల్ బనా... ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, వాటిని అమలు చేయాలన్నా అది యూఏఈ న్యాయవ్యవస్థ ద్వారా మాత్రమే జరుగుతుందని, కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రక్రియ ఏదీ మొదలేకాలేదని తేల్చి చెప్పారు.
దీంతో... అదిగో పులి అంటే ఇదిగో తోక అని ట్విట్టర్ లో పోస్టర్స్ క్రియేట్ చేసి ప్రచారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు కన్ఫాం చేసుకోవాలని ఈ సందర్భంగా బీజేపీ నేతలకు పలువురు సూచిస్తున్నారు. కాగా... భారత ప్రభుత్వం పంపిన దౌత్య పత్రాల వల్లే దావూద్ కు వ్యతిరేకంగా యూఏఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు బీజేపీ అధికార పేజీ గతంలో ట్వీట్ చేసింది. "ప్రధాని మోడీ గొప్ప దౌత్య విజయం.. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తులు యూఏఈలో సీజ్ చేశారు" అని బీజేపీ పేర్కొంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/