ఉద్ద‌వ్ ఠాక్రే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సిందే..?

Update: 2020-04-28 07:50 GMT
మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి ఉద్ద‌వ్ ఠాక్రే త‌ప్పుకునేలా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఆయ‌‌న ప్ర‌స్తుతం ఏ చ‌ట్ట‌స‌భ‌లో ఆయ‌న స‌భ్యుడు కాదు. దీంతో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసి ఆరు నెల‌లు ముగుస్తోంది. ఆ గ‌డువులోపు ఆయ‌న శాస‌నమండ‌లి స‌భ్యుడిగా అయితేనే ముఖ్య‌మంత్రి పీఠంపై కొన‌సాగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఉద్ద‌వ్ ఠాక్రేను శాస‌న మండ‌లి స‌భ్యుడిగా నామినేట్ చేయాలంటూ మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారిని ఆ రాష్ట్ర‌ మంత్రివ‌ర్గం అభ్య‌ర్థించింది. ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గం మ‌రోమారు ఉద్ద‌వ్‌ఠాక్రేకు ఎమ్మెల్సీగా నియ‌మంచాల‌ని కోరుతూ తీర్మానించింది. రెండు వారాల్లో మంత్రివ‌ర్గం రెండుసార్లు ఈ ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ముందుంచింది. అయితే గ‌వ‌ర్న‌ర్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దీంతో రాజ‌కీయంగా తీవ్ర ఉత్కంఠ ఏర్ప‌డింది.

ఉద్ద‌వ్ ఠాక్రే 2019 నవంబర్ 28వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ స‌మ‌యంలో ఠాక్రే ఏ చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ స‌భ్యుడు కాదు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ప్రకారం ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలలోపు శాస‌న‌స‌భ‌లో గానీ, శాస‌న‌మండ‌లిలో గానీ స‌భ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఉద్ద‌వ్ ఠాక్రే ఏ స‌భ‌లోను స‌భ్యుడిగా నియ‌మితులు కాలేదు. మే 28వ తేదీ వ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ఉద్ద‌వ్ ఠాక్రే ఎన్నికై ఆరు నెలలు ముగియనుంది. ఆలోపు ఏదైనా స‌భ‌కు ఎన్నిక కాక‌పోతే ఉద్ద‌వ్ ఠాక్రే విధిలేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇంకా ఒక నెల స‌మ‌యమే ఉంది. ఆలోపు ఆయ‌న స‌భ్యుడు కాక‌పోతే మాత్రం మ‌హారాష్ట్రం లో రాజ‌కీయాలు తీవ్ర మ‌లుపు తిరిగే అవ‌కాశం ఉంది. మంత్రివ‌ర్గం రెండుసార్లు సిఫార్సు చేసినా గ‌వ‌ర్న‌ర్ ఎమ్మెల్సీగా నియ‌మించ‌క‌ పోవడంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
Tags:    

Similar News