బ్రిటన్ వైరస్: కర్ణాటకలో 14 - కేరళలో 8 కేసులు

Update: 2020-12-27 01:30 GMT
బ్రిటన్ దేశంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ దేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులను పరీక్షించగా వారికి కరోనా వైరస్ పాజిటివ్ గా రావడం బెంబేలెత్తిస్తోంది. దీంతో వారితోపాటు వారు కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి అధికారులు క్వారంటైన్ చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో యూకే నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

బ్రిటన్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన వారిలో తాజాగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. వీరి నమూనాలు తీసి పూణే జాతీయ ల్యాబ్ కు పంపారు.

ఇక కేరళలోనూ యూకే నుంచి వచ్చిన 8మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. వీరి శాంపిల్స్ ను ఫూణే వైరాలజీ ల్యాబ్ కు పంపారు.దీంతో అన్ని రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో ఇప్పుడు కోవిడ్ నిబంధనలు మరింత టైట్ చేసి పరీక్షలు చేస్తున్నారు.
Tags:    

Similar News