ప్రపంచంలో కొవిడ్ ధాటికి భారీగా అతలాకుతలమైన దేశం అమెరికా. ఇప్పటికే అత్యధిక కేసుల నమోదుతో మొదటి స్థానంలో ఉన్న యూఎస్.. యూకే వేరియంట్ తో వణికిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే ఏప్రిల్ నాటికి ఈ వైరస్ తీవ్రరూపం దాలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫాసీ ఇదే చెబుతున్నారు.
కొవిడ్-19 అగ్రరాజ్యం అమెరికాను ఇప్పటికే శవాల దిబ్బగా మార్చింది. ఇంకా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇంతలోనే అమెరికన్లకు మరో కష్టం వచ్చి పడింది. యూకే వేరియంట్ వైరస్ అమెరికాను కలవరపెడుతోంది. యూకే వేరియంట్ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య అమెరికాలో క్రమంగా పెగుతోంది. ఈ క్రమంలో అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫాసీ ఆందోళన వ్యక్తం చేశారు.
'ప్రజెంట్ సిచుయేషన్ గమనిస్తే.. యూకే వేరియంట్ ఉధృతి అమెరికాలో ఏప్రిల్ నాటికి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది' అని ఆయన అంటున్నారు. అయితే.. సౌతాఫ్రికా రకం వైరస్‌కు సంబంధించిన అంశంపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. 2020 డిసెంబర్‌లో యూకేలో బయటపడిన కొత్త రకం వైరస్.. ఇప్పటికే అమెరికాలోని 28 రాష్ట్రాలకు పాకింది. దాదాపు 315 మంది దాని బారినపడ్డారు. కొవిడ్-19 కంటే యూకే రకం కరోనా వైరస్ 70 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని పలు నివేదికల్లో వెల్లడైన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. మరణాలు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఒకే రకంగా మొదలైన కరోనా మహమ్మారి.. ప్రస్తుతం మరో నాలుగు కొత్త రకాలుగా రూపాంతరం చెందింది. ఒకపక్క కరోనా మహమ్మారి వ్యాక్సిన్ వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. పూర్తి స్థాయిలో కట్టడి చేశామన్న ఆనందం మాత్రం లేదు. ప్రపంచంలో ఇప్పటిదాకా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య దాదాపు 22లక్షలు దాటింది.
ప్రస్తుతం కరోనా మొదటి రకానికి మాత్రమే వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, అమెరికాలో విస్తరిస్తున్న 'కొత్త స్ట్రెయిన్ల'ను ఈ టీకా ఎంత మేరకు అడ్డుకుంటుందనే విషయంలో క్లారిటీ లేదు. కొత్త రకాలన్నీ.. మొదటి రకానికన్నా ప్రభావవంతమైనవని నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ వ్యాక్సిన్ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది? కొత్త రకాన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్నది చూడాలి.