కాలం చాలా సిత్రమైంది. ఎప్పుడూ ఒకేలా పరిస్థితులు ఉండవు. ఎలాంటి గొడవలు.. శత్రుత్వం లేకున్నా.. భారత్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొన్న ఉక్రెయిన్ ఈ రోజున సాయం కోసం చేతులు జాస్తోంది. తన వారంతా హ్యాండ్ ఇచ్చిన వేళ.. ఎప్పుడూ భారత్ పట్ల అంతర్జాతీయ సమాజం ముందు సానుకూలంగా వ్యవహరించని ఉక్రెయిన్ ఇప్పుడు మాత్రం హెల్ప్ చేయరా? అని కోరుతోంది.
రష్యా షురూ చేసిన సైనిక చర్యతో.. సాయం కోసం హాహాకారాలు చేస్తున్న ఉక్రెయిన్.. ఇప్పటివరకు భారత్ కు ఎలాంటి దన్ను ఇవ్వలేదు. అంత వరకు ఎందుకు? కశ్మీర్ విషయంలో న్యాయంగా ఉండే భారత్ వాదనకు మద్దతు ఇవ్వక పోగా.. పాక్ కు అనుకూలంగా.. భారత్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన దుర్మార్గ చరిత్ర ఉక్రెయిన్ సొంతం.అలాంటి వారు ఈ రోజున తమ వరకు వచ్చేసరికి.. భారత్ సాయం.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట సాయం గుర్తుకు వచ్చింది.
రష్యా సైనిక చర్యకు ముందు ఈయూ దేశాలే కాదు.. అమెరికా చెప్పిన మాటలకు.. సైనిక చర్య మొదలయ్యాక జరుగుతున్న పరిణామాలకు ఎలాంటి పొంతన లేని సంగతి తెలిసిందే. తనకున్న దారులు మూసుకుపోతూ.. చెలరేగిపోతున్న రష్యాను కంట్రోల్ చేయటం కోసం ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేసుకోవాలనుకోవటం లేదు ఉక్రెయిన్. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు పొలోదిమిర్ జెల్ న్ స్కీ.. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు.
ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ కు మద్దతు పలకాలని కోరటమే కాదు.. ఈ విషయాన్ని చెప్పేందుకు నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. భద్రతా మండలిలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ట్విటర్ లో ట్వీట్ చేశారు. రష్యా దాడులు ఆపేలా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా పేర్కొన్నారు. తాజా సైనిక చర్య కారణంగా జరుగుతున్న ఆస్తినష్టం.. ప్రాణ నష్టంపై ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వివరించినట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. రష్యా దాడుల్ని తిప్పి కొట్టేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్ని భారత ప్రధాని మోడీకి వివరించినట్లుగా వెల్లడించారు. అంతేకాద.. శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సాయం అందించటానికైనా భారత్ సిద్ధంగా ఉన్నట్లు మోడీ తెలిపారని.. ఇదే సమయంలో ఉక్రెయిన్ లో భారత ప్రజల భద్రత మీద ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
భారత పౌరులను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి పంపేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఎప్పుడూ.. ఎలాంటి సందర్భంలోనూ భారత్ కు మిత్రుడిగా వ్యవహరించిన ఉక్రెయిన్.. తనకు అవసరం వచ్చిన నాడు మాత్రం భారత్ సాయం కోరటం గమనార్హం.