ఉక్రెయినీ తల్లీబిడ్డలను వేరు చేస్తున్నారు.. జెలెన్ స్కీ తీవ్ర ఆరోపణలు

Update: 2022-04-14 23:30 GMT
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా దాన్ని రెండు నెలలుగా కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే దేశాన్ని హస్తగతం చేసుకోని రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లో మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. ప్రజలను కాల్చిచంపడం.. అలాగే మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తాజాగా ఆధారాలు లభించాయి అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. రష్యా సైనికుల అత్యాచారాల పరంపరకు వారి భార్యలు కూడా అనుమతించిన దారుణాలు వెలుగుచూశాయి.

ఉక్రెయిన్ లో యుద్ధం నెలకొనడంతో లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. అక్కడ కూడా వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.  ఉక్రెయిన్ లో ఉన్న మహిళలపై కూడా రష్యన్ సైనికులు అత్యాచారం చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లోని ఒక ఇంట్లో ప్రవేశించి.. ఆమె కుమారుడిని పక్క గదిలో పెట్టి అత్యాచారం జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసింది.

ఇక ఉక్రెయిన్ దేశ పౌరులను రష్యాలోని మారుమూల ప్రాంతాలకు రష్యా సైన్యం తరలించి దారుణాలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. ఎస్తోనియా పార్లమెంట్ లో ప్రసంగించిన ఆయన ‘సుమారు 5 లక్షల మంది ఉక్రేనియన్లను బలవంతంగా రష్యాలోని మారుమూల ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు.

ఉక్రెయిన్ పిల్లలను రష్యాలోని కుటుంబాలు అక్రమంగా దత్తత తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని జెలెన్ స్కీ ఆరోపించారు. తల్లీబిడ్డలను బలవంతంగా వేరు చేస్తున్నారని జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు చేశారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ నెలన్నరగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధంలో నిరాశ్రయులయ్యారు. చాలా మంది దేశం విడిచి పారిపోయారు. రష్యా సేనలను ఉక్రెయిన్ కూడా ధీటుగానే ఎదుర్కొంటోంది.

రష్యా తీసుకొచ్చిన యుద్ధ నౌకలను నాశనం చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ముందుకు వెళ్తోంది. ఉక్రెయిన్ తీర ప్రాంతాలకు చేరుకున్న రష్యాకు చెందిన మాస్క్యా క్రూజ్ యుద్ధ నౌక చేరుకోగానే ఉక్రెయిన్ క్షిపణితో దాడికి పాల్పడినట్లు చెబుతోంది.దీంతో ఈ యుద్ధం ఆగక మరింత ఎక్కువ అవుతోంది. రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రజలకు ఈ దురాగతాలకు పాల్పడుతోంది.
Tags:    

Similar News