భార‌త్ పైన ఆగ్ర‌హంతోనేనా ఉక్రెయిన్ ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం?

Update: 2022-07-10 08:57 GMT
ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. ప్ర‌పంచ దేశాల‌ను ఏమాత్రం ఖాత‌రు చేయ‌కుండా ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఐదు నెల‌లు దాటిపోయినా ఇప్ప‌టికీ ఉక్రెయిన్ పై దాడులు ఆప‌డం లేదు. అమెరికా, బ్రిట‌న్, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్, ఇత‌ర చిన్నాచిత‌క యూరోప్ దేశాలు హెచ్చ‌రిస్తున్నా ఏమాత్రం పుతిన్ త‌గ్గ‌డం లేదు. ఆయా దేశాలు ర‌ష్యాపైన క‌ఠిన ఆంక్ష‌లు విధించినా వాటిని బేఖాత‌రు చేసి ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాల‌ను ఇప్ప‌టికే స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో సాగుతుంది. మ‌రోవైపు అమెరికా నేతృత్వంలోని నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గ‌నైజేష‌న్), యూరోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ) దేశాల అండ‌తో ఉక్రెయిన్ కూడా ఢీ అంటే ఢీ అని వ్య‌వ‌హ‌రిస్తోంది.

మ‌రోవైపు ఈ యుద్ధం వ్య‌హ‌హారంలో భార‌త్ త‌ట‌స్థ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్, ర‌ష్యా చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌న్నాదే భార‌త్ విధాన‌మ‌ని మ‌న దేశం ప్ర‌క‌టించింది.
దీన్ని ర‌ష్యా స్వాగ‌తించింది కూడా. ర‌ష్యాతో చిరకాలంగా మైత్రి సంబంధాలు నెర‌పుతున్న ర‌ష్యాకు వ్య‌తిరేకంగా భార‌త్ ఏ నిర్ణయం తీసుకోలేదు. అలాగ‌ని ఒక దేశంపై మ‌రో దేశం దురాక్ర‌మ‌ణ‌ను కూడా ఒప్పుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్, ర‌ష్యా చ‌ర్చ‌ల ద్వారా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని భార‌త్ సూచించింది.

ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భార‌త్ లో ఉన్న త‌మ రాయ‌బారిని తొల‌గించారు. ఆయ‌న స్థానంలో కొత్త రాయ‌బారిని కూడా నియ‌మించ‌లేదు. దీనికి కార‌ణ‌మేంటో ఆయ‌న ఇంకా వివ‌రించలేదు. మ‌రోవైపు ఒక్క భార‌త్ మాత్ర‌మే కాకుండా జ‌ర్మ‌నీ, హంగ‌రీ, చెక్ రిప‌బ్లిక్, నార్వే దేశాల్లో రాయ‌బారుల‌ను కూడా తొల‌గించారు. మ‌న‌దేశంతోపాటు ఈ నాలుగు దేశాలు త‌మ అవ‌స‌రాల‌కు ర‌ష్యా చ‌మురుపైన ఆధార‌ప‌డ్డాయి. అమెరికా ఆంక్ష‌లు విధించినా ఇప్ప‌టికీ ర‌ష్యాపైనే చమురు కోసం ఆధార‌ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆ దేశాలు త‌మ‌కు ఏక‌ప‌క్షంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని భావించే ఈ దేశాల్లో రాయ‌బారుల‌ను ఉక్రెయిన్ జెలెన్ స్కీ ఉప‌సంహ‌రించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు త‌న తొల‌గింపుపై భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కూడా స్పందించారు. తాను త్వరలోనే భారత్‌కు తిరిగి వస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనను తొలగించిన విషయాన్ని ఆయన ధృవీకరించ‌డం విశేషం.
Tags:    

Similar News