రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ఆగిపోనుందా..?

Update: 2022-02-28 05:29 GMT
ప్రపంచాన్ని టెన్షన్లో పెట్టిన రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ఆగిపోనుందా..? వార్ విడిచి వారధిని ఏర్పాటు చేసుకోనున్నారా..? బెట్టువీడిన ఇరు దేశాల అధ్యక్షులు చర్చలకు ఎందుకు ఒప్పుకున్నట్లు...? ఎవరిదైనా నష్టమే అని భావించిన దేశాధ్యక్షులు చర్చల ద్వారానే సమస్య పరిస్కారం అవుతుందని ఎందుకు భావిస్తున్నారు..? తాజాగ వస్తున్న కథనాల ప్రకారం ఇరు దేశాలు చర్చలు ప్రారంభించాయని, ఫైనల్ గా ఒక అంగీకారానికి రానున్నాయని తెలుస్తోంది. అయితే ఓవైపు రెండు దేశాలు చర్చలు ప్రారంభించినా.. మరోవైపు యుద్ధం కొనసాగడం గమనార్హం. దీంతో రాను రాను ఏం జరగబోతుంది..?

రష్యా,  ఉక్రెయిన్ల గురించే ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. యుద్ధం జరిగేది రెండు దేశాల్లోనైనా.. ఈ ప్రభావం మనకెంత ..? అని ప్రతీ దేశం చర్చించుకుంటోంది. ప్రపంచంలో అగ్రగామి దేశమైన రష్యా, యూరోపియన్ల సపోర్టుగా ఉన్న ఉక్రెయిన్ రెండు దేశాలు ఇతర దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నవే.

అయితే ఉక్రెయిన్ విషయంలో కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. కానీ యుద్ధంలో భాగంగా తీవ్రంగా నష్టపోతుంది. మొదటి నంచి యుద్ధానికి సిద్ధం అని బెట్టుగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడు రష్యాచర్చకు పిలవడంతో మొదటిసారి అంగీకరించాడు.

ఇన్నాల్లు ఉక్రెయిన్ పై ఆధిపత్యమే లక్ష్యంగా రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. అటు ఉక్రెయిన్ సైతం ధీటుగా పోరాడుతోంది. అయితే రష్యా చర్చల ప్రతిపాదన పెట్టినా ఉక్రెయిన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో రష్యా దుందుడుకుగా వ్యవహరిస్తోంది.

కానీ ఉక్రెయిన్లో తాజా పరిస్థితుల భట్టి చర్చలతోనే పరిష్కారం కానుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావించారు. దీంతో చర్చలకు అంగీకారం తెలిపారు. అయితే ఈ చర్చలు ఉక్రెయిన్ సరిహద్దులోని బెలారస్ వేదికగా జరగనున్నాయి.

రష్యా, ఉక్రెయిన్ల దేశాల చర్చల్లో ‘నాటో’ అంశం కీలకంగా మారనుంది. అమెరికా అనుకూల నాటో కూటమిలో గనుక ఉక్రెయిన్ చేరితే రష్యా భద్రతకు పెను ముప్పు కానుందని, అందువల్ల నాటోలో చేరకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా కోరనుంది.

ఉక్రెయిన్ నాటోలో చేరితో ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి నాటో దళాలు చొచ్చుకు వస్తాయని దీంతో రష్యాకు నాటో పక్కలో బల్లెంగా తయారవుతుందని అనే వైపు చర్చించనున్నారు. ఈ విషయంపై రష్యా మొదటి నుంచీ వాదిస్తున్నా ఉక్రెయిన్ మాత్రం రష్యా నిబంధనలకు ఒప్పుకోలేదు. దీంతో యుద్ధం తోనే పరిస్కారమవుతుందని భావించి యుద్ధానికి తెగపడింది.

అయితే ఇరు దేశాలు చర్చలు సఫలమై శాంతి ఒప్పందం చేసుకుంటారా..? లేక యుద్ధాన్ని కొనసాగిస్తారా..? అనేది నేటి సాయంత్రం తెలియనుంది. ఇప్పటికే ఇరు దేశాల చర్చల బృందం బెలారస్ చేరుకుంది. ఈ చర్చల్లో ఇరు దేశాల అంతర్గత శాఖల అధికారులు, రాయబారులు ఉన్నారు. ఇరు దేశాల అధ్యక్షులు మాత్రం పాల్గొనరు. ఒకవేళ చర్చలు సఫలమైతే అప్పుడు పుతిన్, జెలెన్ స్కీ కలుసుకునే అవకాశం ఉంది. అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం
Tags:    

Similar News