పార్లమెంటులో ఇరగ కుమ్మేసుకున్నారు

Update: 2016-11-15 06:43 GMT
అధికార.. ప్రతిపక్షాల మధ్య గొడవలు మామూలే. బయట ఎన్ని గొడవలు ఉన్నా చట్టసభల్లో కాస్తంత హుందాగా వ్యవహరించే ధోరణి కనిపిస్తుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో ఆవేశం హద్దులు దాటి ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి కనిపిస్తుంటుంది. బల్లల మీదకు ఎక్కటం.. మైకులు విరగొట్టటం లాంటి అతి చేష్టలకు పాల్పడటం మామూలే.

అయితే.. ఈ స్థాయికి మించి పోయింది ఉక్రెయిన్ పార్లమెంట్. ఇద్దరు ఎంపీల మధ్య మొదలైన వాదులాట చివరకు పిడిగుద్దులతో దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఒలెగ్ ల్యాష్కో అనే ఎంపీకి.. యురీ బోక్యో అనే ఎంపీకి మధ్య ఘర్షణ జరిగింది. తనను క్రెమ్లిన్ కు ఏజెంట్ గా విమర్శించిన ల్యాష్కోపై బోక్యో పిడిగుద్దులు కురిపించారు.

ఊహించని ఈ పరిణామానికి ఉలిక్కిపడిన సహచరులు అలెర్ట్ అయ్యారు. వారి మధ్య గొడవను సర్దుబాటుచేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారిద్దరూ ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఇలా ఎంపీలు కొట్టుకోవటం ఉక్రెయిన్ లో కొత్తేం కాదు. 2014లో ఎంహెచ్ 17 విమానం కూలిపోయిన ఘటన ఉదంతంలోనూ ఎంపీలు పార్లమెంటులోనే కొట్టుకోవటం గమనార్హం. వీరిని చూస్తుంటే.. మన ఎంపీలు చాలా మర్యాదస్తుల మాదిరి కనిపించటం ఖాయం.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News