కాబూల్‌లో ఫ్లైట్ హైజాక్... ఏం జరిగిందంటే ?

Update: 2021-08-24 09:15 GMT
ఆఫ్ఘన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకించి  చెప్పాల్సిన అవసరం లేదు.  తాలిబ‌న్ల ఆక్ర‌మ‌ణ‌ల‌తో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది.  మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భ‌య‌ప‌డుతున్నారు. భ‌య‌ప‌డిన‌ట్టుగానే జరుగుతున్నది.  శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు.  మ‌హిళ‌ల‌పై విరుచుకుపడుతున్నారు.  ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాబూల్‌లో మరో సంఘటన జరిగింది.  ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు. విమానం హైజాక్ అయినట్టు అటు ఉక్రెయిన్ విదేశాంగ‌శాఖ ధృవీకరించింది.

రష్యా న్యూస్ ఏజెన్సీ TASS ప్రకారం, మంగళవారం  ఓ ఉక్రెయిన్ విమానం  ఆఫ్ఘనిస్థాన్‌ కి వచ్చింది. అందులో ఉక్రేనియన్లు, తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. అయితే , ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ విమానాన్ని హైజాక్ చేసి, ఇరాన్‌ కు తరలించారు. స్థానిక అధికారుల రిపోర్టుల ప్రకారం.. కాబూల్ నుంచి ఇప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా ఆపేశారు. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్‌ విమానం హైజాక్ అవ్వడమే. విమానంలో గుర్తు తెలియని ప్రయాణికుల బృందం ఉంది అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జెనీ యెనిన్ తెలిపారు.

ఆదివారం ఇలాగే ఓ విమానాన్ని ఉక్రెయిన్‌ లో ఎవరో హైజాక్ చేశారు. ఇప్పుడు మరో విమానం కాబూల్ నుంచి ఎత్తుకుపోయారు. మేము మొత్తం 4సార్లు మా దేశీయుల్ని తీసుకెళ్లాలి అనుకున్నాం. తొలి ప్రయత్నం ఫెయిలైంది. మరో మూడు ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యేలా లేవు. ఎందుకంటే, మా దేశీయులు కాబూల్ ఎయిర్‌ పోర్టులోకి రాలేకపోతున్నారు అని ఆయన తెలిపారు. ఇక్కడ అతి పెద్ద విచిత్రం ఏమిటంటే .. చిత్రమేంటంటే, అసలు అలా విమానాన్ని ఎలా హైజాక్ చేశారన్నది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ పూర్తిగా అమెరికా, నాటో దళాల కంట్రోల్‌లో ఉంది. అక్కడ ఏ విమానం ఎగరాలన్నా, ఏది ల్యాండ్ అవ్వాలన్నా,అమెరికా సైన్యం పర్మిషన్ తప్పనిసరి. అమెరికా సైన్యం 6వేల మంది ఉన్నారు. అంతమంది అక్కడే ఉండి , ఎయిర్ ట్రాఫిక్ మొత్తం తమ కంట్రోల్‌లో ఉంచుకున్న అమెరికా , ఓ విమానం ఈజీగా హైజాక్ అవ్వడం గమనార్హం.  మరో ముఖ్యమైన విషయం .. అందులో ప్రయాణికులు ఎవరు, వాళ్లను ఎందుకు హైజాక్ చేశారు, ఎత్తుకెళ్లింది మామూలు వాళ్లా, ఉగ్రవాదులా, ఇలా ఎన్నో డౌట్లు ఉన్నాయి.  దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News