ఇక‌, క‌లెక్ట‌ర్లు కూడా తిట్లు తినాలా? వైసీపీ నిర్ణ‌యంపై షాక్!

Update: 2022-08-25 23:30 GMT
వారంతా ఐఏఎస్‌లు..  ఉన్న‌త స్థాయిలో జిల్లాల్లో ప‌నులు చేస్తున్నారు. ఇటు ప్ర‌భుత్వానికి, అటు ప్ర‌జ‌ల కు కూడా జ‌వాబుదారీగా ఉన్నారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉన్నారు. అయితే.. వీరు ఇప్పుడు.. ప్ర‌జా బాట ప‌ట్టాల్సిన ప‌ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఏ ప్ర‌భుత్వంకూడా తీసుకోని నిర్ణ‌యాన్ని వైసీపీ స‌ర్కారు తీసుకుంది. ప్ర‌భుత్వం ఐఏఎస్ అధికారుల‌ను కూడా ప్ర‌జాప్ర‌తినిధులుగా మార్చేసే ప్ర‌య‌త్నానికి శ్రీకారం చుట్టింది. ఈ ప‌రిణామంపై సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు త‌ప్పుప‌డుతున్నారు.

''మేం ఉన్న‌ది ప్ర‌జ‌ల‌కు.. ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధులుగా మాత్ర‌మే. గ‌ల్లీగ‌ల్లీ తిరిగి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేసేందుకు కాదు. మాకు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం స‌రికాదు. ఇదిరాజ‌కీయాల్లో ఉన్న‌వారు చేసుకోవాలి.

మ‌మ్మ‌ల్ని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌రికాదు'' అని ఒక సీని య‌ర్ ఐఏఎస్ అధికారి మీడియా ముందే వ్యాఖ్యానించారు. దీనికి కార‌ణం.. తాజాగా సీఎం జ‌గ‌న్ నిర్వ‌హిం చిన స‌మీక్ష‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ఇక నుంచి అధికారులు కూడా తిర‌గాల‌ని ఆదేశించ‌డ‌మే.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కార్య‌క్ర‌మం గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం. ఇది పూర్తిగా రాజ‌కీయ కార్య‌క్ర‌మం. దీనిలో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని వివ‌రించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అనుకూ లంగా ప్ర‌జ‌ల‌తో ఓట్లు వేయించుకునే కార్య‌క్ర‌మం.

అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలు .. ఎంపీలు, మంత్రుల‌కు ప్ర‌జ‌ల నుంచి తిట్లు వ‌స్తున్నాయి. దీంతో వారు.. తీవ్ర‌స్థాయిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధుల‌కు తోడు.. ఐఏఎస్‌ల‌ను కూడా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపించాల‌ని.. సీఎం నిర్ణ‌యించారు.

అయితే.. ఇప్పుడు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబడుతున్నారు. త‌మ‌కు రాజ‌కీయా లు అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం స‌రికాద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనిపై  సీనియ‌ర్ అధికారు లు గుర్రుగా ఉన్నారు. ఇప్ప‌టికే అనేక ప‌నుల‌తో త‌మ‌కు ఊపిరి ఆడ‌డం లేదని.. ఇప్పుడు.. మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. త‌మ‌కు కూడా తిట్లు త‌ప్ప‌వ‌ని.. ఇలాంటి వాటికి తాము వెళ్ల‌లేమ‌ని వారు అంటున్నారు. దీనిపై ఐఏఎస్ సంఘంలో చ‌ర్చించేందుకు ఈ ఆదివారం విజ‌య‌వాడ వేదిక‌గా భేటీ అయ్యేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News