దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించినప్పటి నుంచి దేశంలో ఈ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే దీనిని క్యాష్ చేసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలన్ని ఈ విషయంలో ఏకమవుతూ మోడీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి.
మోడీ పెద్ద నోట్లను రద్దు చేసినా దేశంలో నల్ల కుబేరులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడడం లేదని...సామాన్యులు మాత్రమే తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం మోడీపై ఇదే ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు విషయం దేశంలో ఉన్న బడా బాబులందరికి నాలుగైదు నెలలు ముందుగానే తెలుసని ఆయన అన్నారు.
ఇక మోడీ విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చి ఒక్కొక్కరి అక్కౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక కొత్తగా అందుబాటులోకి తెచ్చిన రూ. 2000 నోట్లతో నల్లధనం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుపై కొన్ని పత్రికల్లో ముందే వార్తలు రావడం పట్ల అనుమానం వ్యక్తం చేసిన ఉండవల్లి... మోడీకి సన్నిహితులైన వారికి, బీజేపీ నేతలకు పెద్ద నోట్ల రద్దు విషయం మూడు నాలుగు నెలలకు ముందుగానే తెలిసిపోయిందని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం ఏర్పడిన ఈ సమస్య నుంచి బయట పడేందుకు జైట్లీ చెప్పినట్టు రెండు మూడు వారాలు, మోడీ చెప్పినట్టు 50 రోజులు సరిపోవని... నెలల నుంచి సంవత్సరాల టైం పడుతుందని ఆయన అన్నారు. ఇక దేశంలో 86 శాతం నగదు పెద్ద నోట్ల ద్వారానే చెలామణి అవుతోన్నందున చిన్న నోట్లు ఎన్ని వచ్చినా ప్రజల కష్టాలు తీరవని ఆయన చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/