మన ఆంధ్రరాష్ట్రాన్ని ఏం చేద్దామని నీతి అయోగ్ చెప్పిందో ఆ వివరాలు ఇమ్మంటే ఇవ్వడం లేదని.. కాన్ఫడెన్షియల్ అంటున్నారని.. దేశం అల్లకల్లోలం అవుతోందని అంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆఖరు ప్రధాన మంత్రి కార్యాలయం కూడా మనకు వివరాలు ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు.
పోలవరంపై వైసీపీ వైఖరి ఏంటో సీఎం జగన్ చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలవరంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించమని చంద్రబాబు నుంచి ఎటువంటి లేఖ ఇవ్వలేదని.. కేంద్రం, ఏపీకి పోలవరం ప్రాజెక్టు అప్పగించడంపై స్పష్టత లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వానికి అవమానం కలిగేలా కేంద్రం లేఖ రాసిందని అన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వాలని కేంద్రమే చెప్పిందన్నారు.
2017 కేబినెట్ నోట్ లో ఏముందో అప్పుడే బయటపెట్టానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. 2014 నాటి రేట్లను 2020లో పనులు చేస్తారా? ఇది ధర్మమా? పోలవరం రిజర్వాయర్, పవర్ ప్రాజెక్టు ఉంటుందా? నీతి అయోగ్ ప్రధానికి రాసిన లేఖ ఏంటి అని ప్రశ్నించారు.
ఏపీకి అన్యాయం జరుగుతుంటే అడగడానికి వైఎస్ జగన్ కు భయమెందుకు? అని ఉండవల్లి ప్రశ్నించారు. ప్రజలు అనుకున్నట్లు సీబీఐ కేసులకు భయపడుతున్నారా? అని ఉండవల్లి విమర్శించారు.
నాడు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని.. ఇప్పుడు బీజేపీ కూడా పోలవరంపై మోసం చేస్తోందని.. వైఎస్ జగన్ సర్కార్ గట్టిగా అడగడం లేదని ఉండవల్లి మండిపడ్డారు. పోలవరంపై జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.