క్కోసారి ఎంతటి అనుభవజ్ఞులకైనా తత్వం బోధపడదంటారు. ఇప్పుడు సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి అలానే ఉన్నట్లుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపానికి తుప్పలు పట్టేసిన కాంగ్రెస్ పార్టీ గురించి అంతా తెలిసిన ఉండవల్లి.. ఆ తరువాత ఆ పార్టీకి దూరమైనా కూడా ఇంకా ఆ అనుభవంతో తత్వం ఒంటపట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. గత ఎన్నికలప్పుడు రాష్ట్ర విభజన ఏపీ ప్రజల్లో ఆవేదన కలిగించడంతో పాటు ఎన్నికల్లో సెంటిమెంటుగానూ మారింది. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశమూ దాదాపు అదే స్థాయిలో సెంటిమెంటుగా మారింది. హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీని.. ఆ పార్టీతో దొంగాట ఆడుతూ ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేసిన టీడీపీని జనం దూరం పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతూ, దీక్షలు చేస్తున్న వైసీపీని కూడా వారు అదే కళ్లతో చూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఉండవల్లి తాజాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హోదా ఎలా
సాధిస్తారో వైసీపీ - టీడీపీలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు... తనను పిలిస్తే ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలుకుతానని అన్నారు. అది కూడా టీడీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావించారు. దీంతో ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి చూపని.. కనీసం రాజీనామాలు కూడా చేయని టీడీపీ నిరసనలకు మద్దతు తెలుపుతానని అనడం ఒకెత్తయితే.. అది కూడా పిలిస్తే వస్తాననడం మరో ఎత్తు. దీంతో ఉండవల్లికి ఏమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిలిచి బొట్టు పెడితే ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొంటారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
మరోవైపు ఆయన ప్రత్యేక హోదా ఉద్యమం వల్ల ఫలితం లేదన్నట్లుగా మాట్లాడారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తే బీహార్ - ఒడిశా వంటి రాష్ట్రాలు ఊరుకుంటాయా అని, ప్రత్యేక హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్‌తో టీడీపీ, వైసీపీ కలుస్తాయా? అని ఆయన ప్రశ్నించారు.